Site icon NTV Telugu

Gopichand : ‘విశ్వం’ హిందీ రైట్స్ ఎంతకు అమ్మారంటే..?

Whatsapp Image 2024 04 16 At 12.01.39 Pm

Whatsapp Image 2024 04 16 At 12.01.39 Pm

మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత హీరోగా మారి వరుస సినిమాలు చేసి వరుస హిట్స్ కూడా అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ పరిస్దితి అంత గొప్పగా ఏమి లేదు.. ఆయన చేసిన ప్రతి సినిమా వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది..ప్రస్తుతం గోపీచంద్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.సూపర్ హిట్ సినిమా అందించి మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు..గోపీచంద్ నటించిన రామ బాణం, భీమా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.దాంతో ఇప్పుడు శ్రీను వైట్ల డైరక్షన్ లో విశ్వం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామాతో గోపీ చంద్ బిగ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం మేరకు విశ్వం సినిమా కూడా ఫైనాన్సియల్ సమస్యల్లో ఉందని సమాచారం.

ఈ సినిమా ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అవ్వటంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని టేకొవర్ చేసింది. దర్శకుడు, హీరో ఇద్దరు కూడా వరుస ఫ్లాఫ్స్ లో ఉండటంతో ఈ సినిమా లో బడ్జెట్ లో తెరకెక్కుతుంది అని అనుకున్నారు. కానీ  32-35 కోట్ల రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది అని సమాచారం.దీనితో విశ్వం బడ్జెట్ ఓవర్ అవ్వడం,ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ తగ్గిపోవడం వల్ల ‘విశ్వం’ ఇబ్బందుల్లో పడినట్టు సమాచారం.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ రైట్స్ మంచి రేటే పలికినట్లు తెలుస్తుంది.12 కోట్ల రూపాయలకు ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ వెళ్లినట్లు సమాచారం.

Exit mobile version