NTV Telugu Site icon

Tiger Nageswararao :టైగర్ నాగేశ్వరరావు టూ డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?

Whatsapp Image 2023 10 22 At 2.16.15 Pm

Whatsapp Image 2023 10 22 At 2.16.15 Pm

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `టైగర్‌ నాగేశ్వరరావు`  దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించారు. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు.ఎంతో గ్రాండ్ గా విడుదలై ఈ చిత్రం నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయితే సినిమాలో యాక్షన్‌ ఎపిసోడ్స్, రవితేజ పాత్ర తప్ప మరేదీ కూడా ఆకట్టుకునేలా లేదని చాలా మంది అంటున్నారు. సినిమాలో ఏమాత్రం, ఎమోషన్‌ క్యారీ కాలేదని,. డైరెక్షన్‌ ఫెయిల్యూర్‌గా చెబుతున్నారు. దీనికితోడు మూడుగంటల నిడివి ఉండటం కూడా సినిమాకు పెద్ద మైనస్‌. ఈ నేపథ్యంలో సినిమాలో భారీగా కోత పెట్టారు. దాదాపు 25 నిమిషాలు కట్‌ చేశారు.సినిమా నిడివి రెండు గంటల 37 నిమిషాలు చేశారు.ఇక ఈ సినిమా దసరా విన్నర్‌ అంటూ చిత్ర యూనిట్ సెలబ్రేషన్‌ చేస్తుంది. కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. రవితేజ స్టార్‌ ఇమేజ్‌కి పాన్‌ ఇండియా రిలీజ్‌కి, వచ్చిన కలెక్షన్లు పొంతన లేదు. మొదటి రోజు ఈ సినిమా తొమ్మిది కోట్లు కలెక్షన్ల గ్రాస్‌ చేసింది. ఐదున్నర కోట్ల నెట్‌ సాధించింది.

ఇక రెండో రోజు కలెక్షన్స్ సగానికి పడిపోయాయి.. ఐదు కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. రెండున్నర నుంచి మూడు కోట్ల షేర్‌ ను సాధించింది. `టైగర్‌ నాగేశ్వరరావు` థియేట్రికల్‌ బిజినెస్ దాదాపు 39కోట్లు. నిజాంలో ఎనిమిదన్నర కోట్లు, సీడెడ్‌లో ఐదున్నర కోట్లు, ఆంధ్రాలో 17కోట్లు, ఇతర ఇండియాలో నాలుగు కోట్లు, ఓవర్సీస్‌లో మూడు కోట్ల బిజినెస్‌ అయ్యింది. కానీ రెండు రోజుల్లో ఇది 14కోట్ల గ్రాస్‌, ఎనిమిది కోట్ల నెట్‌ సాధించింది. అంటే ఇంకా ఈ చిత్రానికి 31కోట్ల షేర్‌ రాబట్టాలి. అంటే సుమారు 65కోట్లు రాబట్టాలి. ఎంత చేసిన ఆదివారం నుండి మంగళవారం వరకు కొంత సందడి ఉండొచ్చు. ఆ తర్వాత పూర్తిగా పడిపోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే మరో పది కోట్లు కలెక్ట్ చేస్తేనే గగనంగా చెబుతున్నారు.ఈ లెక్కన `టైగర్‌ నాగేశ్వరరావు` డిజాస్టర్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. సుమారు 20-25కోట్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేర్‌ వీరయ్య`తో హిట్‌ అందుకున్న రవితేజ. ఇందులో చిరంజీవి తమ్ముడిగా  నటించీ మెప్పించారు . ఆ తరువాత `రావణాసుర` చిత్రంతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది కూడా డిజాస్టర్‌ అయ్యింది