Tiger Nageswararao :టైగర్ నాగేశ్వరరావు టూ డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `టైగర్ నాగేశ్వరరావు` దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు.ఎంతో గ్రాండ్ గా విడుదలై ఈ చిత్రం నెగటివ్ టాక్ని తెచ్చుకుంది. అయితే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, రవితేజ పాత్ర తప్ప మరేదీ కూడా ఆకట్టుకునేలా లేదని చాలా మంది అంటున్నారు. సినిమాలో ఏమాత్రం, ఎమోషన్ క్యారీ కాలేదని,. డైరెక్షన్ ఫెయిల్యూర్‌గా చెబుతున్నారు. దీనికితోడు మూడుగంటల నిడివి ఉండటం కూడా సినిమాకు పెద్ద మైనస్. ఈ నేపథ్యంలో సినిమాలో భారీగా కోత పెట్టారు. దాదాపు 25 నిమిషాలు కట్ చేశారు.సినిమా నిడివి రెండు గంటల 37 నిమిషాలు చేశారు.ఇక ఈ సినిమా దసరా విన్నర్ అంటూ చిత్ర యూనిట్ సెలబ్రేషన్ చేస్తుంది. కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. రవితేజ స్టార్ ఇమేజ్‌కి పాన్ ఇండియా రిలీజ్‌కి, వచ్చిన కలెక్షన్లు పొంతన లేదు. మొదటి రోజు ఈ సినిమా తొమ్మిది కోట్లు కలెక్షన్ల గ్రాస్ చేసింది. ఐదున్నర కోట్ల నెట్ సాధించింది.
ఇక రెండో రోజు కలెక్షన్స్ సగానికి పడిపోయాయి.. ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండున్నర నుంచి మూడు కోట్ల షేర్ ను సాధించింది. `టైగర్ నాగేశ్వరరావు` థియేట్రికల్ బిజినెస్ దాదాపు 39కోట్లు. నిజాంలో ఎనిమిదన్నర కోట్లు, సీడెడ్‌లో ఐదున్నర కోట్లు, ఆంధ్రాలో 17కోట్లు, ఇతర ఇండియాలో నాలుగు కోట్లు, ఓవర్సీస్లో మూడు కోట్ల బిజినెస్ అయ్యింది. కానీ రెండు రోజుల్లో ఇది 14కోట్ల గ్రాస్, ఎనిమిది కోట్ల నెట్ సాధించింది. అంటే ఇంకా ఈ చిత్రానికి 31కోట్ల షేర్ రాబట్టాలి. అంటే సుమారు 65కోట్లు రాబట్టాలి. ఎంత చేసిన ఆదివారం నుండి మంగళవారం వరకు కొంత సందడి ఉండొచ్చు. ఆ తర్వాత పూర్తిగా పడిపోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే మరో పది కోట్లు కలెక్ట్ చేస్తేనే గగనంగా చెబుతున్నారు.ఈ లెక్కన `టైగర్ నాగేశ్వరరావు` డిజాస్టర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. సుమారు 20-25కోట్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేర్ వీరయ్య`తో హిట్ అందుకున్న రవితేజ. ఇందులో చిరంజీవి తమ్ముడిగా నటించీ మెప్పించారు . ఆ తరువాత `రావణాసుర` చిత్రంతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
తాజావార్తలు
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?