NTV Telugu Site icon

IND vs NZ: ఆరేళ్లుగా వెంటాడుతున్న బ్యాడ్ లక్.. ఇది ఏడోసారి

Pant 1

Pant 1

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో.. సెంచరీని మిస్ చేసుకున్నాడు. గత ఆరేళ్లలో పంత్‌ టెస్టుల్లో ఏడోసారి 90-99 రన్స్ మధ్య ఔటయ్యాడు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి నాలుగో వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. పంత్‌, సర్ఫరాజ్‌ల భాగస్వామ్యంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Read Also: Nokia Lay Off: 2000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన నోకియా..

శనివారం న్యూజిలాండ్ బౌలర్లను సర్ఫరాజ్, పంత్ ముప్పు తిప్పలు పెట్టారు. ఈ క్రమంలో పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేసి 12వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో.. టెస్టుల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు పూర్తి చేసిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. అయితే.. అభిమానులందరు పంత్ సెంచరీ చేస్తాడని అనుకున్నప్పటికీ.. 99 పరుగుల వద్ద విలియం ఓ రూర్కే బౌలింగ్‌లో ఔట్ అయ్యి సెంచరీని కోల్పోయాడు. అత్యధిక సార్లు 90లో ఔటైన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు సెంచరీ కోల్పోయిన భారత్‌కు అవాంఛిత రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అతను తన కెరీర్‌లో మొత్తం 10 సార్లు 90లో ఔటయ్యాడు. ఆ తర్వాత.. రాహుల్ ద్రవిడ్ తొమ్మిది సార్లు సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు.

Read Also: Tecno Pova 5 Pro 5G: రూ. 12,499కే స్మార్ట్ ఫోన్.. దీపావళి ఆఫర్

పంత్ టెస్టుల్లో 99 పరుగుల వద్ద ఔట్ అయిన 10వ భారత బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఆటగాళ్ల సరసన చేరాడు. టెస్టులో భారత్ తరఫున గంగూలీ, ధోనీలు కూడా 99 పరుగులకే ఔట్ అయ్యారు. టెస్టుల్లో గంగూలీ రెండుసార్లు 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్.. 44.75 సగటుతో 2551 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని ఇన్నింగ్స్‌ల్లో 276 ఫోర్లు, 64 సిక్సర్లూ ఉండటం విశేషం.