NTV Telugu Site icon

Aadhaar Card : ఆధార్ కార్డులో అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా ?

Adhaar Card

Adhaar Card

Aadhaar Card : భారత ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఓ ఐడెంటిఫికేషన్ ఉండాలని తీసుకు వచ్చిన గుర్తింపు కార్డు ‘ఆధార్’. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పత్రాల్లో ఆధార్ కార్డ్ ఒకటి. దాదాపు ప్రతి ప్రభుత్వ పథకాలు, పలు సౌకర్యాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ క్రమంలో మనం కొన్ని సార్లు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగం నిమిత్తం ఒక నగరం నుంచి మరొక నగరానికి పోవాల్సి వచ్చినప్పుడు ఆధార్ కార్డులో పాత చిరునామా ఉంటుంది. అప్పుడు మీరు ఆ నగరంలో ప్రభుత్వ సౌకర్యాలను కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో అడ్రస్ మార్పు తప్పనిసరి అవుతుంది. కొన్ని ప్రక్రియలను అనుసరించడం ద్వారా ఆధార్‌లో మీ చిరునామాను సులభంగా మార్చవచ్చు.

Read Also: GT vs PBKS: ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 153 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్ బౌలర్లు

మీరు ఆధార్ కార్డులో మీ చిరునామాను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. కాకపోతే దీని కోసం మీరు కొన్ని పత్రాలను సమర్పించాలి. ఆధార్ కార్డును నిర్వహించే సంస్థ UIDAI మీకు నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే ఆధార్ కార్డులో మీ చిరునామాను మార్చుకోవాలని సూచించింది. మీరు మీ ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. అంతే కాకుండా సదరు వ్యక్తి బయోమెట్రిక్ ఐరిస్, వేలిముద్ర, ఫోటోను కూడా మార్చవచ్చు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా మార్చుకోవచ్చు. అయితే, ప్రతి వ్యక్తి పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే మార్చగలరు. పుట్టిన తేదీని ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చాల్సి వస్తే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీని మార్చడానికి, చెల్లుబాటు అయ్యే జనన ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాలి.

Read Also:Meta: ఫ్రీ ఫుడ్ ఇక లేదు.. మెటా నిర్ణయంపై ఉద్యోగుల అసంతృప్తి..

చిరునామాను ఎలా అప్‌డేట్ చేయాలి
ఆధార్‌లో మీ చిరునామాను అప్‌డేట్ చేయడానికి UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.. లేదా ఆధార్ సేవా కేంద్రం (ASK) లేదా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఆధార్‌లో మీ చిరునామాను అప్‌డేట్ చేయడానికి మీరు చెల్లుబాటు అయ్యే చిరునామా పత్రాన్ని సమర్పించాలి.. అప్‌డేట్ ప్రక్రియ పూర్తికావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.