Sanatan Dharma: సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆయన వ్యాఖ్యలపై ఫైర్ అవుతోంది. డీఎంకే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటంతో కాంగ్రెస్ కూడా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందనేంటని..? బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం తాము అన్ని మతాలను, విశ్వసాలను గౌరవిస్తానని చెబుతోంది. పలువురు జాతీయస్థాయి నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే ద్వేషం అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Khalistan: “మీ కోసం వస్తున్నాం”.. భారత నాయకులకు ఖలిస్తానీల బెదిరింపు
ఇదిలా ఉంటే ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ సీనియర్ యనేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. మౌనం అంగీకరానికి సూన అంటూ విమర్శలు గుప్పించారు. సనానత సంప్రదాయం పట్ల బీజేపీ గర్విస్తోందని, కుల, మతాలకు అతీతంగా అందరికి సమాన అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ మౌనంగా ఉండటం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
ఓట్లు పొందడానికి మీరు ఇంత దిగజారిపోవాలా..? అంటూ ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించాలని సోనియాగాంధీ ఎప్పుడైనా అనునకున్నారా..? రామజన్మభూమిని ఇంతవరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా సందర్శించలేదని ఆరోపించారు. రుగ్వేదాన్ని పేర్కొంటూ సనాతన ధర్మం గొప్పతనానని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని, ఇది సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాలతో పోల్చాడు. డీఎంకే పార్టీ నేత ఏ. రాజా సనాతనాన్ని సామాజిక కళంకంగా, ఎయిడ్స్, కష్టులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి.
