Mamata Banerjee: రైతులపై టియర్ ప్రయోగించడంపై మమత ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున అన్నదాతలు (Farmers Protest) దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. సరిహద్దుల్లోనే వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు మోహరించాయి. బలగాలను తోసిపుచ్చుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో వారిపై టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఉద్రిక్తతలో పలువురు రైతులు గాయపడ్డారు. ఇంకోవైపు అన్ని వైపులా రోడ్లను పోలీసులు నిర్బంధించారు. రహదారులకు అడ్డంగా బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా తప్పుపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు పోరాడుతుంటే.. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడం సరికాదన్నారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలా అయితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని నిలదీశారు. రైతులపై బీజేపీ చేసిన దాడిని ఖండిస్తున్నట్లు ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్లో పోస్టు చేశారు.
రైతుల డిమాండ్లు ఇవే
1. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి
2. రైతులకు రుణమాఫీ చేయాలి
3. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
4. 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒఫ్పందాలు రద్దు చేయాలి
5. ఉత్తరప్రదేశ్ లఖిమ్ పూర్ ఖేరి మృతులకు పరిహారం ఇవ్వాలి
6. 2020లో ఆందోళన చేసిన సమయంలో నమోదు చేసిన కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.
వీటిలో కనీసం మద్దతు ధర, విద్యుత్ సవరణ చట్టం ఒప్పందాలు రద్దు చేయాలి, రుణ మాఫీ, స్వామి నాథన్ సిఫారసులపై హామీ ఇచ్చినా సరేనని రైతులు స్పష్టం చేశారు. ఆ నాలుగు డిమాండ్లపై కేంద్ర మంత్రుల బృందం రైతు నేతలకు హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!