Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Houthis Capture Un Staff In Yemen Amid Israel Strikes

Houthis: యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..

Published Date :September 1, 2025 , 5:54 pm
By Shiva Ganesh
Houthis: యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Houthis: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హౌతీల ప్రధానమంత్రితో సహా అనేక మంది సీనియర్ కమాండర్లు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనా, హుదేయిదా అనే ఓడరేవు పట్టణంపై దాడి చేశారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి 11 మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని యెమెన్ భద్రతా అధికారులు చెప్పారు.

READ ALSO: Kerala: ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..

వారిని షరతులు లేకుండా విడుదల చేయాలి..
హౌతీ తిరుగుబాటుదారులు బందీలుగా చేసుకున్న వ్యక్తులు ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. హౌతీ తిరుగుబాటుదారులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, సంస్థ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, కార్యాలయాలను కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ ఘటన చాలా దారుణమని యెమెన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి హన్స్ గ్రండ్బర్గ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను వెంటనే, ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యేక రాయబారి హన్స్ గ్రండ్బర్గ్ మాట్లాడుతూ.. UN కార్యాలయంపై దాడి చేసి దాని ఉద్యోగులను బందీలుగా తీసుకోవడం సరైనది కాదని అన్నారు. హౌతీ తిరుగుబాటుదారుల చర్య యెమెన్ తీర్మానాన్ని ఉల్లంఘిస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నిజానికి యెమెన్లో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సహాయ కార్మికులు గూఢచర్యం చేసి ఇజ్రాయెల్, అమెరికాకు సమాచారం అందిస్తున్నారని హౌతీ తిరుగుబాటుదారులు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, హౌతీ తిరుగుబాటుదారులు తమ పరిధిని విస్తరించారు. డ్రోన్లు, క్షిపణుల ద్వారా అనేక వాణిజ్య ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. తాము పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నామని, దీని కోసం ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే ఉంటామని హౌతీలు స్పష్టం చేశారు.

READ ALSO: Shocking School Fees: బాబోయ్ స్కూల్ ఫీజులు.. అక్షరాల లక్షలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Antonio Guterres statement
  • Hans Grundberg Yemen
  • Hodeidah Sanaa UN incident
  • Houthi rebels abduct UN
  • Houthis UN staff hostage

తాజావార్తలు

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

  • MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

  • Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions