Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
- భారతీయుల పడవపై సౌదీ అరేబియా దాడి..
- జుకార్ ద్వీపం సమీపంలో ఘటన జరిగినట్లు హౌతీల ఆరోపణ..
- 14 మంది భారతీయుల్ని రక్షించేందుకు హౌతీల చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi-Houthi war: ఎర్ర సముద్రంలో భారతీయులతో వెళ్తున్న నౌకపై సౌదీ అరేబియా దాడి చేసినట్లు ప్రకటించింది. జుకార్ ద్వీపం సమీపంలో 14 మంది భారతీయ పౌరులను తీసుకెళ్తున్న పడవపై దాడి జరిగినట్లు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు గురువారం తెలిపారు. పడవలో ఉన్న వారిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు హౌతీ సైనిక ప్రతినిది బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరీ తెలిపారు. ఎర్ర సముద్రంలో జుకార్ ద్వీపం సమీపంలో ఒక భారతీయ పడవను లక్ష్యంగా చేసుకుని సౌదీ దాడి చేసినట్లు యాహ్యా సరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
14 మందిని రక్షించేందుకు హౌతీలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సౌదీ చేసిన దాడిని నిర్లక్ష్యపూరితమైందిగా హౌతీలు అభివర్ణించారు. ఇలాంటి చర్యలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పు కలిగిస్తాయని యహ్యాసరీ అన్నారు. సౌదీ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు.
Also Read
- Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
- Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
- Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
దాడి జరిగిన ప్రాంతం అత్యంత కీలకమైన జలసంధి బాబ్-అల్-మాండెబ్కు సమీపంలో ఉంటుంది. ఇది ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఎడన్కు అక్కడి నుంచి హిందూ మహాసముద్రానికి కలుపుతుంది. అంతర్జాతీయ నౌకాయానానికి కీకలంగా ఉంది. ప్రస్తుతం పడవలో ఉన్న 14 మంది భారతీయుల పరిస్థితి, సహాయక చర్యల పూర్తి వివరాలు విడుదల కాలేదు. ఈ దాడిపై, హౌతీ వాదనపై సౌదీ అరేబియా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
-
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
-
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి