NTV Telugu Site icon

Houthi Rebels: అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన హౌతీ రెబల్స్ ..

Houthi Rebels

Houthi Rebels

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక అమెరికన్ నౌకపై యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో పాటు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. ఇక, అధికారులు ఈ సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వానికి అందించారు. అయితే, గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఓడల కదలికను ప్రభావితం చేస్తూ ఇటీవల దాడులు కొనసాగుతుంది.

Read Also: Bharat Atta: భారత్ అట్టా పథకం కోసం మూడు లక్షల టన్నుల గోధుమలు

అమెరికాతో పాటు మిత్రదేశాలు శుక్రవారం తిరుగుబాటుదారులపై దాడులు చేసింది. అయితే, కొన్ని రోజుల పాట సైలెంట్ గా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ దాడిని అమెరికా ధృవీకరించింది. యూరప్‌ను యూరప్‌కు అనుసంధానించే కీలకమైన కారిడార్ అయిన సూయజ్ కెనాల్ వెంబడి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సమయంలో హౌతీలు ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి చమురు, సరుకు రవాణా నౌకలను టార్గెట్ చేశారు. ఇలాంటి దాడులు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ప్రాంతీయ వివాదంగా మార్చే ప్రమాదం ఉంది.

Read Also: Hyderabad: గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం.. ఈసారి ఎండకు మండాల్సిందే..

ఇక, ఇరాన్ మిత్రపక్షమైన షియా రెబల్ గ్రూప్ హౌతీ ఈ దాడికి బాధ్యులమని ఇంకా ప్రకటించలేదు. ఎర్ర సముద్రం యొక్క దక్షిణ ప్రాంతాలలో పని చేస్తున్న అర్లీ బర్క్-క్లాస్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ లాబూన్, హౌతీ షెల్లింగ్‌కు గురి అయినట్లు అమెరికా ఆర్మీ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఎర్ర సముద్రపు ఓడరేవు నగరం హొడెయిడా సమీపంలో ఈ క్షిపణి వచ్చిందని అమెరికా తెలిపింది. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటు ప్రాంతాల నుంచి యుఎస్‌ఎస్ లాబూన్ వైపు యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం రాలేదు..