Water waring: నీరు వృథా చేస్తే భారీ ఫైన్.. ఎక్కడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి సమస్యలు మొదలవుతుంటుంది. భూగర్భ జలాలు ఎండిపోవడం.. చెరువుల్లో, కాలువుల్లో నీరు అడుగంటిపోవడంతో తాగునీటి కష్టాలు మొదలవుతుంటాయి. ఇంకోవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో బెంగళూరు ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. నీరు వృథా చేస్తే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు హౌసింగ్ సొసైటీ నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు నగరంలోని యల్హంక, కనకపుర, వైట్‌ఫీల్ట్ ప్రాంతాల్లో నివసించే వారికి తాగునీటి సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. ఈ క్రమంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో నివసించే వారిలో ఎవరైనా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే.. వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇదిలా ఉంటే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా నగరంలోని ట్యాంకర్ల యజమానులు మార్చి 7 నాటికి తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.556 కోట్లు మంజూరుచేసినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరు నగరంలోని ప్రజల కోసం తమవంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఖాళీ పాల ట్యాంకులను నీటి నిల్వకు, సరఫరా కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!