NTV Telugu Site icon

Madhyapradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ చర్యలు

Madhyapradesh

Madhyapradesh

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, క్రూరంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లను మధ్యప్రదేశ్‌లో అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు రవీంద్ర చౌదరి, అతుల్ బధౌలియాగా గుర్తించబడ్డారు. వారు సత్నా జిల్లాలోని మైహార్ పట్టణంలోని ప్రసిద్ధ దేవాలయాన్ని నిర్వహించే ట్రస్ట్‌లో రోజువారీ వేతన ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. అత్యాచార ఘటన తెరపైకి రావడంతో ఇద్దరినీ ఉద్యోగాల నుంచి కమిటీ తొలగించింది. రాష్ట్రంలోని విదిశా జిల్లాలోని ఉదయ్‌పూర్‌లో రవీంద్ర ఇల్లు నేలమట్టం కాగా, న్యూ బస్తీలోని మలియన్ తోలాలో అతుల్ ఇల్లును కూడా అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. కూల్చివేత పనులు జరుగుతున్నందున ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: Muharram: మొహర్రం ఊరేగింపులో అపశ్రుతి.. విద్యుదాఘాతానికి నలుగురు బలి

ఒక ప్రముఖ ఆలయం సమీపంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఒళ్లంతా రక్తం కారేలా రాక్షసుల్లా కొరికేశారు. నిందితులు ఇద్దరూ మైనర్ బాలిక ప్రైవేట్ భాగాలలో గట్టి వస్తువును చొప్పించారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే బాలిక వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే దీనిని నిర్ధారించగలమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆమెను దారుణంగా రేప్ చేసిన అనంతరం.. ఒక చోట పడేసి వెళ్లిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, ఆ బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను అధునాతన వైద్య సంరక్షణ కోసం డివిజనల్ హెడ్ క్వార్టర్స్ రేవాలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Also Read: TamilNadu Fire Accident: బాణసంచా గోదాములో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి, 20 మందికిపైగా గాయాలు

ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు బాలికను ప్రలోభపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ శుక్రవారం స్థానిక కోర్టులో హాజరుపరచగా వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు వారిలో ఒకరు ఆలయ నిర్వహణ కమిటీ నిర్వహిస్తున్న గోశాలలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత మైనర్‌కు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు బుల్డోజర్‌ చర్యలకు పాల్పడ్డారు.