ప్రపంచంలో ఒకచోట ఎడతెరిపి లేని వర్షాలు.. మరొక చోట అగ్ని వర్షం కురుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ తో లక్షలాది మంది ప్రజలు వేడికి అల్లాడిపోతున్నారు. యూరప్, జపాన్‌లో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రత కారణంగా అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో గరిష్ట పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 నుండి 20 డిగ్రీల ఫారెన్‌హీట్ ఎక్కువగా నమోదైంది. టెక్సాస్ నుండి కాలిఫోర్నియా వరకు రికార్డ్ బ్రేకింగ్ హీట్ ఉంది. 16 రోజులుగా వేడిగాలులు వీస్తుండటంతో అక్కడి జనజీవనం అతలాకుతలమైంది. అమెరికాలో దాదాపు 110 మిలియన్ల మంది వేడిగాలులతో ఇబ్బంది పడుతున్నారు.
Vishnu Vardhan Reddy: బీజేపీ-జనసేన కలిసి.. 2024 ఎన్నికలను ఎదుర్కొంటాయి
భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో డెత్ వ్యాలీ ఆఫ్ కాలిఫోర్నియా ఒకటి. ఇక్కడ ఆదివారం ఉష్ణోగ్రత కొత్త శిఖరాన్ని తాకవచ్చు. శనివారం మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. బహుశా ఆదివారం 54 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ వేడిమి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు దక్షిణ యూరప్ లో వచ్చే వారం కూడా తీవ్రమైన వేడి ఉండనుంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇటలీ, స్పెయిన్, గ్రీస్ దేశాలు భయంతో అల్లాడిపోతున్నాయి. ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రోమ్, బోలోగ్నా మరియు ఫ్లోరెన్స్‌తో సహా 16 నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సార్డినియాలో గరిష్ట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 48C (118.4F) వరకు ఉండే అవకాశం ఉన్నందున.. వచ్చే వారం కూడా హీట్‌వేవ్ కొనసాగుతుందని భావిస్తున్నారు.
Anjeer Fruit Cultivation: అంజీరా పండ్ల సాగులో తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఐతే ఓ పక్క గ్లోబల్ వార్మింగ్ ఉంటే.. దక్షిణ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వర్ష బీభత్సంతో డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 33 మంది మరణించారని, మరో 10 మంది గల్లంతయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా కొంతమంది మరణించారు. అంతేకాకుండా భారతదేశంలోని.. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో సహా కొండ ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో వరదల బీభత్సం కొనసాగుతూ ఉంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడును వదిలేస్తే కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి. జార్ఖండ్, బీహార్, అస్సాం, త్రిపుర, మిజోరాం మరియు మేఘాలయలో కూడా వర్షాలు లేవు. ప్రస్తుతం ఆ ప్రదేశాల్లో రుతుపవనాలు ఇంకా యాక్టివ్‌గా లేవు.