Disha Patani : నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ బ్యూటీ దిశా పటానీ ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘ఎంఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంతో మంచి క్రేజ్ ను అందుకుంది. అయితే తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో దిశా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ‘కుంఫు యోగా’ ‘భారత్’ ‘భాగీ 2’ ‘మలంగ్’ మరియు ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వంటి సినిమాలతో ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ‘యోధ’ చిత్రంతో పాటుగా అక్షయ్ కుమార్ తో కలిసి ‘వెల్కమ్ టు ది జంగిల్’ మూవీలో నటిస్తోంది.దిశా పటాని చాలా గ్యాప్ తర్వాత ‘కల్కి 2898 AD’ సినిమాతో మళ్లీ సౌత్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అలానే ‘కంగువ’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెడుతోంది. శివ డైరెక్టర్ లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో హీరో సూర్యకు జోడీగా నటిస్తోంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ లోని నెపోటిజంపై ఈ హాట్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నెపోటిజం విషయంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ను టార్గెట్ చేస్తూ కొందరు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారికి అవకాశాలు దూరం చేస్తాడని, టాలెంట్ లేని స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తాడని మండిపడుతుంటారు. అయితే కరణ్ జోహార్ ని సమర్థిస్తూ తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహర్ ప్రస్తుతం ‘యోధ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ మరియు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ అంబ్రే, పుష్కుర్ ఓజా సంయుక్తంగా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 15న విడుదల కానున్న నేపథ్యంలో లేటెస్టుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిశా మాట్లాడుతూ తనలోని నటిని గుర్తించింది కరణ్ జోహార్ అని చెప్పింది.”ఈరోజు నేను నటినయ్యానంటే, అది కేవలం కరణ్ జోహార్ వల్లనే. ఎందుకంటే నేను మోడలింగ్ చేస్తున్నప్పుడు నాలోని నటిని గుర్తించింది ఆయనే. నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆ సమయంలో ఆయన నన్ను ఒక నటిగా గుర్తించకపోయుంటే, నేను ఇక్కడ అలా ఉండేదాన్ని కాదని భావిస్తున్నాను. కొందరు ఆయన గురించి ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ నేనొక బయటి వ్యక్తినే నటిగా నిరూపించుకునేందుకు నాకు ఆయన ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను.” అని దిశా పటానీ చెప్పుకొచ్చింది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!