బెట్టింగ్ ముఠాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు రంగారెడ్డి జిల్లాలోని గుర్రపు స్వారీ స్థావరంపై పోలీసులు దాడు చేశారు. రాజేంద్రనగర్ తేజస్వీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గుర్రపు స్వారీ బెట్టిం నిర్వహిస్తుండగా 13 మందిని పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 17 మొబైల్ ఫోన్లు, 19 డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, రూ.51 వేల నగదు హార్స్ రేసింగ్ గైడ్ బుక్‌తో పాటు ఓ కారును సీజ్ చేశారు పోలీసులు. తేజస్వీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు చేశారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసిన కేటుగాళ్లను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు.
Also Read : Shiva Karthikeyan: మరో క్యాచీ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న శివ కార్తికేయన్
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు తిరుమల్ రెడ్డి వాట్స్ఆప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో గుర్రపు స్వారీ సమాచారం పోస్టు చేస్తున్నాడు. అయితే.. ఆర్‌ఎస్ వరల్డ్ అనే గ్రూప్ ద్వారా తిరుమల్ రెడ్డి గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వారు అందరూ బాడా వ్యాపారస్తులుగా గుర్తించారు పోలీసులు. గత సంవత్సరం నుండి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ 13 మందిపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
Also Read : Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా