NTV Telugu Site icon

Horrifying Video: గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో చిన్నారి.. ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు..

Gorilla

Gorilla

మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి కూడా మంచి చెడులను అర్థం చేసుకుంటాయి. అయితే వాటికి మాటలు రాని కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారనేది వేరే విషయం. జంతువులు నివసించే ప్రదేశంలోకి మానవులు వెళ్తే.. అవి వారిపై దాడి చేయడం చాలా సార్లు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు జంతువులు.. మానవులకు సహాయకులు లేదా రక్షకులుగా ఉంటాయనేదానికి ఈ వీడియో ఉదాహరణ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గొరిల్లా 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడింది.

IND vs AFG: భారత్ – అఫ్గానిస్థాన్ రెండో టీ20 మ్యాచ్.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఈ వీడియోను సచ్కద్వాహి అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పోస్ట్ చేసారు. ఈ వీడియో 1986 ఆగస్టు 31 నాటిదని చెప్పాడు. తన కుటుంబంతో కలిసి జెర్సీ జూని సందర్శించడానికి వచ్చిన ఓ 5 ఏళ్ల బాలుడు లెవాన్ మెరిట్.. గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడు. అందులో ఉన్న పెద్ద గొరిల్లా అంచనాలకు విరుద్ధంగా అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని రక్షించింది. ఆ బాలుడికి గొరిల్లా మధ్య గోడలా నిలబడి ఆ బాలుడికి హాని కలిగించకుండ కాపాడుతుంది. ఆ తరువాత.. గొరిల్లా కూడా ఆ పిల్లవాడి వీపుపై లాలించి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది.

Ram Mandir: 700కి పైగా “శవపరీక్షలు” నిర్వహించిన మహిళకు రామాలయ ఆహ్వానం..

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది చూశారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓ వినియోగదారుడు చేతులు ముడుచుకుని, ‘దేవుడు సృష్టించిన అత్యుత్తమ జీవి’ అని రాశాడు. మరొక వినియోగదారు.. ‘జంతువులకు కూడా హృదయాలు ఉన్నాయి.’ అని రాశాడు. మూడవ వినియోగదారు, ‘కింగ్ కాంగ్ ఈజ్ రియాలిటీ’ అని రాశాడు.

Show comments