NTV Telugu Site icon

Road Accident: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Road Accident

Road Accident

అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఏడుగురు మరణించారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ ల సహాయంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు, బస్సు ఢీ కొనడంతో బస్సు నుజ్జునుజ్జ అయింది. దీంతో గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసేందుకు సహాయక సిబ్బందికి కష్టతరంగా మారింది.

Also Read : Maoist : హన్మకొండలో మావోయిస్టు అగ్రనేత దేవేందర్ రెడ్డి అరెస్ట్

లక్నో-గోరఖ్ పూర్ హైవే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కువ స్తున్న క్రమంలో ప్రైవేట్ బస్సు అంబేద్కర్ నగర్ వైపు వెళ్లేందుకు హైవేపై టర్న్ తీసుకుంటుంది. దీంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రక్కు బోల్తాపడి బస్సు కిందపడిపోయిందని ఆయోధ్య చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారని.. 40 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాద ఘటనపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినట్లు సీఎంఓ హిందీలో ఓ ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Also Read : Family Dispute : అన్నం వండలేదని బాలింతను కొట్టి చంపిన భర్త