11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!

Honor X80 Pro Max

Honor X80 Pro Max

HONOR X80 Pro Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బ్యాటరీ సామర్థ్యానికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది హానర్ (HONOR) సంస్థ. కొత్త X80 సిరీస్‌లో భాగంగా HONOR X80 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 22న చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో ఏకంగా 11,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్స్ లో ఇదే అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యం. అంతేకాకుండా.. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో ఇతర డివైస్‌లను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిజైన్ పరంగా కూడా ఈ మొబైల్ లో ఎనర్జెటిక్ ఆరెంజ్, లైట్నింగ్ రెడ్, మూన్ షాడో వైట్, మిస్టిక్ బ్లాక్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. అలాగే గోల్డ్-స్టాండర్డ్ డ్రాప్ ప్రొటెక్షన్‌తో పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయాన్ని కూడా కంపెనీ అందించనుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా ఉండనున్నట్లు టీజర్ ద్వారా వెల్లడైంది. లీకుల ప్రకారం.. HONOR X80 Pro Maxలో 6.78 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉండనుంది. ఈ డిస్‌ప్లే 2788 × 1280 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందించనుంది. ఈ ఫోన్ పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్ అండ్ డ్రాప్ రెసిస్టెంట్ బాడీతో రాబోతుంది.

పనితీరు పరంగా చూస్తే.. ఈ ఫోన్ లో కొత్త Qualcomm Snapdragon 6 Gen 5 ప్రాసెసర్‌తో రానుంది. ఈ ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌లలో రావడం మొదటిసారి. ధరతో పాటు పూర్తి స్పెసిఫికేషన్లు జూన్ 22న అధికారిక లాంచ్ సందర్భంగా వెల్లడికానున్నాయి. అయితే ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాలను బట్టి చూస్తే.. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, బలమైన నిర్మాణంతో ఈ ఫోన్ మార్కెట్లో బలంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.