Site icon NTV Telugu

ఇక పవర్ బ్యాంకుతో పనిలేదు.. మొదటిసారిగా 10,000mAh బ్యాటరీతో రాబోతున్న HONOR WIN సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?

Honor Win

Honor Win

HONOR WIN: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సంచలనానికి హానర్ (HONOR ) సంస్థ సిద్ధమవుతోంది. హానర్ ఇప్పటికే డిసెంబర్ 26న చైనాలో HONOR WIN, HONOR WIN RT స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ WIN సిరీస్ ఫోన్లు ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్లుగా నిలవనున్నాయి. ఇది HONOR ఇటీవల విడుదల చేసిన HONOR X70 (8300mAh బ్యాటరీ)ను కూడా మించి ఉండడం విశేషం.

Year Ender 2025: వరదలు, తుఫాన్లు, వడగాలులు.. కాళరాత్రిని మిగిల్చిన ఏడాది…! 2026లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్?

ఈ స్మార్ట్‌ఫోన్లలో హానర్ అభివృద్ధి చేసిన Qinghai Lake సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీతో 5 గంటల పాటు నిరంతర గేమింగ్ చేసినా, ఇంకా సగానికి పైగా బ్యాటరీ మిగిలి ఉంటుంది అని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా గేమింగ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ బ్యాటరీ డిజైన్ చేయబడింది. ఈ HONOR WIN సిరీస్‌లో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది తడి చేతులతోనూ పనిచేస్తూ, కేవలం 0.14 సెకన్లలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఫోన్లు IP68, IP69, IP69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో వస్తుంది. ఇది రఫ్ అండ్ టఫ్ కు మరింత భద్రతను అందిస్తుంది.

ఈ సిరీస్ ఫోన్లు Snapdragon 8 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్ పై పనిచేస్తాయి. వీటిలో 16GB వరకు LPDDR5X Ultra RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకారం ఈ ఫోన్లు AnTuTuలో 44,09,382 స్కోర్ సాధించాయి. గేమింగ్ సమయంలో వేడి నియంత్రణ కోసం ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్ ను అందిస్తున్నారు. అలాగే HONOR సరౌండ్ సబ్ వూఫర్ 2.0తో కూడిన డ్యుయల్ 1216 సిమెట్రికల్ స్పీకర్లు ఉండటంతో ఇమర్సివ్ గేమింగ్ ఆడియో అనుభవం లభించనుంది.

Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!

HONOR WIN, WIN RT ఫోన్లు 6.83 ఇంచుల 1.5K రిజల్యూషన్‌తో 120Hz ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయని లీకులు పేర్కొంటున్నాయి. కెమెరా విభాగంలో పెద్ద సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందించే అవకాశముంది. డిసెంబర్ 26న అధికారిక లాంచ్‌కు ముందే మరిన్ని ఫీచర్లు, ధరల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తంగా భారీ బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, గేమింగ్ ఫోకస్‌తో HONOR WIN సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పేలా కనిపిస్తోంది.

Exit mobile version