Site icon NTV Telugu

64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

Honor Magic V6

Honor Magic V6

Honor Magic V6 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ హానర్ (Honor) బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC 2026) వేదికగా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘హానర్ మ్యాజిక్ V6’ (Honor Magic V6)ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. మరి ప్రీమియం ఫీచర్ల సమ్మేళనంగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు ఏంటో చూసేద్దామా..

సన్నని డిజైన్ & డిస్‌ప్లే:
Honor Magic V6 ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్లలో ఒకటిగా నిలవనుంది. మడతపెట్టినప్పుడు దీని మందం కేవలం 8.75 మిల్లీమీటర్లు మాత్రమే ఉండటం విశేషం. ఇందులో 6.52 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7.95 అంగుళాల ప్రధాన అంతర్గత డిస్‌ప్లేలను అందించారు. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ అందిస్తాయి. అలాగే ఇందులో స్క్రీన్ రక్షణ కోసం నానోక్రిస్టల్ షీల్డ్ కోటింగ్ ఉపయోగించడం ద్వారా ఫోన్ మన్నికను పెంచారు.

Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?

ప్రాసెసర్/చిప్‌సెట్‌:
ఈ ఫోన్ క్వాల్కమ్ సరికొత్త స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5 ) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ తో వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం. వేగవంతమైన పనితీరుతో పాటు గేమింగ్ సమయంలో వేడిని నియంత్రణ చేయడం కోసం వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10 పై నడుస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్‌:
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 MP ప్రధాన కెమెరా (OIS సపోర్ట్‌తో), 64 MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 50 MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం లోపల, బయట వైపులా 20 MP కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి AI ఇమేజ్ ఇంజిన్ సాయంతో తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన, నాణ్యమైన ఫోటోలు అందిస్తాయి.

బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:
ఫోల్డబుల్ ఫోన్లలో సాధారణంగా కనిపించే చిన్న బ్యాటరీ పరిమితిని అధిగమిస్తూ.. ఇందులో 6,660mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అమర్చారు. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.

Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు

వాటర్ రెసిస్టెన్స్ & AI ఫీచర్లు:
Honor Magic V6ను 5 లక్షల సార్లు మడతపెట్టినా ఎలాంటి సమస్యలు రాకుండా SGS ధృవీకరించింది. దీనికి IP68 + IP69 రేటింగ్స్ ఉండటంతో నీరు, ధూళి నుండి పూర్తి రక్షణ లభిస్తుంది. AI అసిస్టెడ్ మల్టీటాస్కింగ్, AI మీటింగ్ ఏజెంట్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఫోన్ ఫీచర్స్ ను పెంచుతాయి. అలాగే ‘హానర్ కనెక్ట్’ ఫీచర్ ద్వారా ఐఫోన్, యాపిల్ వాచ్ నోటిఫికేషన్లను షేర్ చేసుకునే అవకాశం ఉంది.

ధర:
ఈ కొత్త స్మార్టీ ఫోన్ బ్లాక్, గోల్డ్, రెడ్, వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జులై నుండి ఎంపిక చేసిన మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ధర, వివిధ వేరియంట్స్ వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

Exit mobile version