NTV Telugu Site icon

Ind vs Pak: విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు.. గెలిచిన పాకిస్థాన్

Ind Vs Pak

Ind Vs Pak

Ind vs Pak: హాంగ్‌కాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీలో భారత్‌కు శుభారంభం దొరకలేదు. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా రాబిన్‌ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. కాగా, 1992లో మొదటిసారిగా హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీ ప్రారంభించినప్పటికి.. 2017 వరకు కొనసాగింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల 2023 వరకు వాయిదా పడింది. ఈ ఏడాది తిరిగి మళ్లీ టోర్నీ స్టార్ట్ అయింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య హాంగ్‌కాంగ్‌, న్యూజిలాండ్‌, నేపాల్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఒమన్‌ తదితర 12 జట్లు ఈసారి బరిలోకి దిగాయి.

Read Also: Matangi : ఇండియన్ నేవీకి కొత్త ఆయుధం.. సిబ్బంది లేకుండా 600కి.మీ ప్రయాణించిన ‘మాతంగి’

అయితే, ఈ క్రమంలో శుక్రవారం టోర్నీ స్టార్ట్ అయింది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోటీ పడింది. రాబిన్‌ ఊతప్ప కెప్టెన్సీలోని టీమిండియా.. నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 రన్స్ చేసింది. కెప్టెన్‌ ఊతప్ప ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 31 రన్స్ చేయగా.. భరత్‌ చిప్లీ 16 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నందున రూల్స్ ప్రకారం రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Read Also: Israel Hezbullah Conflict : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి.. భారీ మొత్తంలో కూలిన భవనాలు.. 45 మంది మృతి

కాగా, భారత్ విధించిన లక్ష్యాన్ని పాకిస్తాన్‌ ఈజీగా ఛేదించింది. ఆసిఫ్‌ అలీ 14 బంతుల్లో 55 రన్స్ చేయగా.. మహ్మద్ అఖ్లాక్‌ 12 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికి తోడుగా కెప్టెన్‌ ఫహిమ్‌ ఆష్రఫ్‌ 5 బంతుల్లోనే 22 రన్స్ తో అజేయంగా నిలిచాడు. ఎక్స్‌ట్రా రూపంలో 4 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో భారత జట్టుపై ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది.