NTV Telugu Site icon

Archana Nag Story: అందాలతో వీవీఐపీలకు వలపు వల విసిరిన కిలేడీ.. అర్చనా నాగ్ డర్టీ పిక్చర్ స్టోరీ..

Archana Nag

Archana Nag

Archana Nag: అర్చనా నాగ్.. ఎంతో మంది వీవీఐపీలకు వలపు వల విసిరిన కిలేడీ. ఆమె స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సినిమా స్టార్లు ఇలా ఎంతో మంది ప్రముఖులను తన వలలో వేసుకుని అందంతో ఒక ఆట ఆడించింది. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన హనీట్రాప్.. ఒడిశాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్‌కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశంతో అర్చనా నాగ్ జైలుకు కూడా వెళ్లొచ్చింది.

 

ఒడిశాలోని కలహండి జిల్లా కెసింగ ప్రాంతం. అర్చనా నాగ్, ఆమె భర్త జోగబంధు నాగ్ 2015లో భువనేశ్వర్ వచ్చారు. అక్కడ ఓ బ్యూటీపార్లర్‌లో అర్చన పనికి చేరింది. అందానికి మెరుగులు దిద్దడమే కాకుండా అదే అందంతో కోట్లకు కోట్లు ఎలా వెనకేసుకోవచ్చని అక్కడే నేర్చుకుంది. భువనేశ్వర్ సిటీలో బాగా పేరున్న పార్లర్‌గా అది పాపులర్ అయింది. అక్కడికే చాలా మంది రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు వచ్చేవారు. వారితో పరిచయాలు పెంచుకుంది. ఫోన్ నంబర్లను సంపాదించింది. తన గెటప్‌ కూడా మార్చేసింది. కాస్త మాట కలసిందంటే చాలు..అసలు ఆట మొదలుపెట్టేది. అన్ని పార్టీల నేతలను తరచుగా కలిసేది అర్చనా నాగ్. తన మాటలతో బోల్తా కొట్టించేది. చూపులతో బుట్టలో వేసుకునేది. రకరకాల సంకేతాలిస్తూ ట్రాప్‌లో పడేసిది. నాయకుల్లోని అబల క్షణాలను అనుకూలంగా మలుచుకునేది. తనను ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే వారికి దగ్గరైంది. వారి గుట్టు పట్టుకున్న అర్చన.. తననే ఎరగా వేసుకుంది. అందాల ఎరకు చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యారు నేతలు. రాజకీయ నాయకులు ఆమెతో తమ కోరికలను తీర్చుకోవాలనుకున్నారు. ఆమె కాదనలేదు. ఎందుకంటే అర్చన టార్గెట్ కూడా అదే. అనేక మంది నాయకులు ఆమెతో రాసలీలలు సాగించారు. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో వారికే తెలియకుండా వీడియోలు తీసుకుంది. ఆ తతంగమంతా షూట్ చేయించింది. ఆ వీడియోలతోనే బ్లాక్‌ మెయిల్‌ చేసి కోట్లకు కోట్లు కప్పంలా కట్టించుకునేది. ఎంతో మంది ప్రముఖులు అర్చన కబందహస్తాల్లో చిక్కుకుపోయారు. ఒక్కొక్క నాయకుడి బండారాన్ని తన గుప్పిట పెట్టుకున్న వారితో సయ్యాటలు ఆడేది. వీడియోలు చూపెట్టి కోట్లు డిమాండ్ చేసింది. అనేక మంది రాజకీయ నాయకులు ఆమె కాళ్లు వేళ్లు పట్టుకుని కోట్లు సమర్పించుకున్నారు.

Read Also: Nandyal Crime: పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..

బ్యూటీపార్లర్‌లో మొదలైన ఆమె జీవితం.. నాలుగైదు ఏళ్లలోనే ఖరీదైన బంగ్లాల్లోకి మారింది. భువనేశ్వర్‌లోని సత్యవిహార్‌ ఏరియాలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లగ్జరీ హౌస్ కట్టుకుంది. 2021 జనవరిలో గృహప్రవేశం చేసింది. నాటి ఎమ్మెల్యే సూర్యనారాయణ పాత్రో ముఖ్య అతిథిగా వచ్చి రిబ్బన్ కట్ చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అర్చన.. మగవారి బలహీనతతో ఆడుకుని కోట్లు సంపాదించి ఆదిత్య ప్రెస్టీజ్ కంపెనీతో పాటు పాత కార్ల షోరూమ్‌ను ప్రారంభించింది. మరో కంపెనీ కూడా స్టార్ట్ చేసింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అర్చనకు భువనేశ్వర్‌తో పాటు చాలా నగరాల్లో ఖరీదైన భవనాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నా తనకు ఆధారమైన హనీట్రాప్‌ను మాత్రం వదల్లేదు. ఎప్పటికప్పుడు నేతలకు వలపు వల విసిరేది. రాజకీయ నాయకులు, ప్రముఖుల స్థాయిని బట్టి తన కార్యక్రమం ఉండేది. బెంగాల్, ముంబై నుంచి యువతులను రప్పించి కంపెనీ తెరిచింది. వ్యభిచారం నడిపించింది. ఏం చేసినా ఆమె టార్గెట్ మాత్రం రాజకీయ నాయకులే. వారైతేనే పరువు పోతుందన్న భయంతో అడిగినంతా ఇచ్చుకుంటారు. చాలా మంది దగ్గరికి బెంగాల్, ముంబై నుంచి యువతులనే పంపించేది. మరీ హైప్రొఫైల్ వ్యక్తి అయితే తానే స్వయంగా వెళ్లేది. ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసి బ్లాక్‌ మెయిలింగ్ చేసి డబ్బులు గుంజేది.

Read Also: Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. ఎదురుదాడిలో టెర్రిరిస్ట్ హతం

కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అర్చనకు కూడా బ్యాడ్‌టైం స్టార్ట్ అయింది. ఆమె పాపం పండింది పోలీసులకు చిక్కింది. చిత్రమేమిటంటే.. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆమె బాధితుల్లో ఉన్నారు. ఆమె ఎక్కడ తమ రహస్యాలను బహిర్గతం చేస్తుందోనని అందరూ అల్లాడిపోయారు. ఆమె ఎక్కడ బయటపెడుతుందోనని డబ్బుల మూటలతో మోకరిల్లారు. నాడు అధికారంలో ఉన్న బీజేడీ నుంచి 20 మంది, బీజేపీ నుంచి కొందరు.. రాజకీయ నేతలే కాకుండా వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు అర్చన వలపు వలలో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాతో పాటు బెంగాల్‌కు చెందిన ప్రముఖులు కూడా చిక్కుకున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. అర్చన భర్త జోగబంధు నాగ్, వ్యాపార పార్ట్నర్ ఖగేశ్వర్‌ పాత్రోలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో 14 నెలల పాటు అర్చనా నాగ్ జైలు జీవితం గడిపింది. రిలీజైన తర్వాత కూడా ఆమె ఏ మాత్రం మారలేదు. ఇప్పటికీ అనేక మంది రాజకీయ నాయకుల జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉంది. భర్త అంటే.. భార్య తప్పుడు దారిలో వెళ్తుంటే సరిదిద్దాలి. కానీ అర్చన భర్త జోగబంధు నాగ్ భార్యను స్వయంగా వ్యభిచారంలోకి దించాడు. ఈ వ్యవహారంలో ప్రోత్సహిస్తూ వచ్చాడు.

అర్చనా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లను పరిశీలించిన పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. 2018 నుంచి 2022 మధ్య.. కేవలం నాలుగేళ్లలో అర్చనా-జోగబంధుల ఆస్తి రూ.30 కోట్లకు చేరుకుందని చెప్తున్నారు. ఆమె ఏయే విలాసాలు కోరుకుందో.. అవన్నీ నెరవేర్చుకుందామె. అంటే.. ఆ భార్యభర్తల బ్లాక్‌మెయిలింగ్‌ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ నిర్మాతను మూడు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేయడంతో.. ఆయన నాయపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్‌ 6న అర్చనా అరెస్ట్‌ కాగా.. అప్పటి నుంచి రోజుకో రోజుకో సంచలనం బయటపడుతూనే వస్తోంది. జోగబంధు డ్రగ్స్‌ కార్యకలాపాలు సైతం వెలగపెట్టేవాడని తేలింది. ఇక ఈ వ్యవహారంలో ఆర్థిక దర్యాప్తు విభాగాలను సైతం దర్యాప్తు చేపట్టాలని ఒడిషా పోలీసులు కోరుతున్నారు.

 

Show comments