Pathan Movie Controversy: షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాట పెను వివాదాన్ని సృష్టించింది. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన బికినీ రంగుపై పలువురు నేతలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది మతాన్ని అవమానించడమేననంటూ మండిపడుతున్నారు. అలాగే ఈ సినిమా చూడబోమని చాలా మంది సోషల్ మీడియాలో చెబుతూనే ఉన్నారు. అయినా కూడా ఈ పాటను సపోర్ట్ చేసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. చాలా మంది ఆర్టిస్టులు ‘బేషరమ్ రంగ్’ పాటపై రీల్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంలోకి సింగర్, ర్యాపర్ హనీ సింగ్ దూకారు. పాట వివాదంపై ఆయన బహిరంగంగానే మాట్లాడారు. ఇటీవలి కాలంలో సినిమాలపై వ్యతిరేక నిరసనలు పెరిగాయనే దానిపై హనీ సింగ్ మాట్లాడారు.
Read Also: Vijay – Ajith : తొమ్మిది ఏళ్ల తర్వాత సంక్రాతి బరిలో స్టార్ హీరోలు.. ఎవరు గెలుస్తారో మరి?
దీంతో పాట వివాదంపై ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతకుముందు మరింత స్వేచ్ఛ ఉందన్నారు. 2013లో షారుఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ కోసం హనీ సింగ్ ‘లుంగీ డ్యాన్స్’ పాటను కంపోజ్ చేశారు. ఇలాంటి విషయాలను తాను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోనని.. ప్రజలు చాలా తెలివిగల వారని ఈ విషయాన్ని వినోదంగానే తీసుకుంటారని అన్నారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గురించి హనీ సింగ్ మాట్లాడుతూ, “రెహమాన్ సర్ ఒక పాట ఉంది, ‘రుక్మణి రుక్మణి షాదీ కే బార్ క్యా క్యా హువా….’ ప్రజలు ఈ పాటను అంగీకరించారు. అది వింటూ పెరిగాను. కానీ నేను అలాంటి పాట రాశాక జనాలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు చాలా సెన్సిటివ్‌గా మారారు. ఇది కేవలం వినోదం మాత్రమే కానీ వారు దానిని వినోదంగా చూడరు.