Site icon NTV Telugu

Honda X-ADV: అడ్వెంచర్ రైడింగ్‌కు అనుగుణంగా స్టైలిష్ లుక్ తో X-ADV లాంచ్..!

Honda X Adv

Honda X Adv

Honda X-ADV:హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తాజాగా భారత మార్కెట్‌లో తన మాక్సీ స్కూటర్ X-ADV ని లాంచ్ చేసింది. ఇది ఒక అడ్వెంచర్ మోటార్‌సైకిల్ శైలిని, మాక్సీ-స్కూటర్ సౌలభ్యాన్ని మిళితం చేస్తూ రూపొందించబడింది. ప్రస్తుతం ఈ స్కూటర్ సంబంధించి Honda BigWing డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, డెలివరీలు మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి.

Read Also: Budget Smartphones: కేవలం 15 వేలకే 6000 mAh బ్యాటరీ, అద్భుత కెమెరా ఫీచర్లతో లభించే ఫోన్స్ ఇదిగో..!

ఇంజిన్ :
Honda X-ADVలో 745cc లిక్విడ్-కూల్డ్ SOHC 8-వాల్వ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,750 RPM వద్ద 57hp శక్తిని, అలాగే 4,750 RPM వద్ద 69 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది పవర్, పనితీరు పరంగా క్లాస్‌లో బెస్ట్ అని చెప్పవచ్చు.

డిజైన్, హార్డ్‌వేర్:
X-ADVను పూర్తిగా అడ్వెంచర్ రైడింగ్‌కు అనుగుణంగా రూపొందించారు. ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్ మీద నిలబడి ఉండే ఈ స్కూటర్‌లో డ్యూయల్ LED హెడ్‌లైట్లు, డే టైం రన్నింగ్ లైట్లు (DRL) ఉన్నాయి. స్కూటర్ ముందు వైపు 17 అంగుళాల చక్రం, వెనుక 15 అంగుళాల స్పోక్ వీల్ ఉంటుంది. సస్పెన్షన్ కోసం 41mm USD ఫోర్క్‌లు ముందువైపు, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ వెనుకవైపు ఉన్నాయి. బ్రేకింగ్ పరంగా చూస్తే.. ముందు డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్ పిస్టన్ కాలిపర్లు, 296mm డిస్క్‌లు, వెనుకవైపు సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో 240mm డిస్క్ ఉంటుంది.

Read Also: Google I/O 2025: వర్చువల్ ట్రై-ఆన్, ధరల ట్రాకింగ్, సులభమైన చెల్లింపులు.. షాపింగ్ కోసం కొత్త ఏఐ మోడ్..!

ఫీచర్లు:
Honda X-ADVలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 5 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్ప్లే, Honda RoadSync యాప్ సపోర్ట్ లో భాగంగా కాల్స్, SMS అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్, వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. అలాగే రైడ్-బై-వైర్ టెక్నాలజీ, స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ లాంటి నాలుగు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇంకా రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.

ధర:
Honda X-ADV రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ అయింది. డెలివరీలు జూన్ 2025 నుండి ప్రారంభం కానున్నాయి/ అలాగే ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొత్తంగా అడ్వెంచర్ శైలిని ప్రేమించే స్కూటర్ రైడర్లకు Honda X-ADV ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్ కలబోతతో ఇది మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సాధించగలదు.

Exit mobile version