NTV Telugu Site icon

Honda Activa 125cc: కొత్త లుక్‌తో ఆక్టివా 125 స్కూటర్.. ఫీచర్లు ఇలా

Honda 125 Activa

Honda 125 Activa

Honda Activa 125cc: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా 125 ను కొత్త లుక్‌తో విడుదల చేసింది. కొత్త ఆక్టివా 125 స్కూటర్ లో కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా డిజైన్‌లో అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్‌ను రూ.94,422 ఎక్స్ షోరూమ్ ధరకు విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త ఆక్టివా 125 సంబంధించిన ఫీచర్లు, ధర మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం.

Also Read: Huge Discount On iPhone 15 Plus: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

కొత్త ఆక్టివా 125 లో 124cc 4-స్ట్రోక్ SI ఇంజిన్ ఇస్తారు. ఇది 6.11bhp మాక్సిమమ్ పవర్, 10.4Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ పెర్ఫార్మెన్స్, ఫ్యూయల్ ఎఫీషియెన్సీ ఇంకా రైడర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొత్త ఆక్టివా 125 కస్టమర్లకు 5 వేరియంట్స్‌లో లభిస్తుంది. ఇందులో పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మేటలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మేటలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్ లలో అందుబాటులో ఉన్నాయి.

Also Read: Game Changer : గేమ్ ఛేంజర్ ఈవెంట్లో పవర్ స్టార్ మేనియా

కొత్త ఆక్టివా 125 లో 4.2 ఇంచుల TFT డిస్ ప్లే ఉంది. ఇది హోండా రోడ్సింక్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది. దీనితో రైడర్‌లు టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్‌కు సులభంగా యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా, స్కూటర్‌లో ఒక USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇది రైడర్‌లకు అత్యవసర సమయంలో తమ డివైస్‌లను ఛార్జ్ చేయడం సులభతరం చేస్తుంది. కొత్త ఆక్టివా 125 తన ఐకానిక్ డిజైన్‌ను నిలుపుకుంటూ, ప్రీమియమ్ టచ్ కోసం కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్, ఇన్నర్ ప్యానెల్‌ను అందిస్తుంది. స్కూటర్ మొత్తం పొడవు 1850mm, వెడల్పు 707mm, ఎత్తు 1170mm, 1260mm వీల్‌బేస్, 162mm గ్రౌండ్ క్లీరెన్స్‌తో తయారయ్యింది. కొత్త ఆక్టివా 125 స్కూటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హోండా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

Show comments