NTV Telugu Site icon

Honda Activa Electric: అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌

Honda Electric

Honda Electric

Honda Activa Electric: హోండా మోటార్‌ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఈరోజు (నవంబర్ 27) కంపెనీ రెండు వేరియంట్లలో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. ఇందులో స్టాండర్డ్, సింక్ డుయో ఉన్నాయి. యాక్టివా E, యాక్టివా QC1 పేర్లతో వీటిని విడుదల చేసారు. హోండా యాక్టివా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశం రోడ్ల పరిస్థితికి అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది. అయితే Activa E మాత్రం భారతదేశం, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం అభివృద్ధి చేయబడింది.

Also Read: Sanjay Raut: ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే విఫలం.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి..

ఇకపోతే, ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు 2025 నాటికి అందుబాటులోకి వస్తాయి. ఈ వాహనాల కోసం బుకింగ్ జనవరి 1, 2025 నుండి ప్రారంభమవుతుంది. రెండు ఉత్పత్తుల ధరలు జనవరి 2025లో తెలవనున్నాయి. ఇక డెలివరీ మాత్రం ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి దేశములో కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలలో విక్రయించబడుతుంది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను బెంగళూరు సమీపంలోని కర్ణాటకలోని తన ఫెసిలిటీలో తయారు చేస్తోంది. ఇక హోండా యాక్టివా E రెండు మార్చుకోగల బ్యాటరీలను కలిగి ఉంది. ఇది ఛార్జింగ్‌లో అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

డిజైన్ పరంగా చూస్తే.. రెండు బైక్స్ లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నాయి. హోండా Activa E ముందు, వెనుక భాగంలో LED కాంబినేషన్ లైట్లను పొందుతుంది. అయితే QC1 మాత్రం అధిక మౌంటెడ్ LED DRLలు లభిస్తాయి. అలాగే Activa E ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. అదే QC1 లో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇక ఈ బైకుల స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. హోండా యాక్టివా బ్లూటూత్ కనెక్టివిటీతో TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. ఈ మోడల్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, అలాగే కాల్ ఇంకా ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కలిగి ఉంది. మరోవైపు QC 1 విషయానికి వస్తే.. ఒక సాధారణ LCD యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. స్టాండర్డ్, స్పోర్ట్, ఎకాన్ మోడ్ లు ఉంటాయి.

Also Read: Sanjay Raut: ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే విఫలం.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి..

మార్చుకోగలిగిన బ్యాటరీ సెటప్ హౌసింగ్ రెండు 1.5 kWh బ్యాటరీలను పొందుతుంది. ఈ బ్యాటరీల యూనిట్ నుండి పవర్ వీల్ సైడ్ ఎలక్ట్రిక్ మోటారుకు బదిలీ చేయబడుతుంది. ఇది 4.2 kW (5.6 bhp) పవర్ అవుట్‌పుట్‌ని కలిగి ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌పై 102 కి.మీ.ల పరిధిని అందించడానికి దోహదం చేస్తాయి. అయితే, QC1 కేవలం 80 కి.మీ.ల పరిధిని మాత్రమే కలిగి ఉంది. చూడాలి మరి ఇప్పటి వరకు ఉన్న ప్రముఖ బ్రాండ్స్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ బైకులు ఎంతవరకు పోటీని ఇవ్వగలవో.