NTV Telugu Site icon

Bikes : దాదాపు ఒకే ధరలో లభించే హోండా హార్నెట్ 2.0, యమహా ఎంటీ 15 వీ2 లలో ఏది బెటర్

New Project 2025 02 19t192536.859

New Project 2025 02 19t192536.859

Bikes : దేశ ద్విచక్ర వాహన సంస్థ హోండా ఇండియా భారత మార్కెట్లో కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అప్ డేటెడ్ OBD2B-కంప్లైంట్ హార్నెట్ 2.0 ను విడుదల చేసింది. అప్‌డేటెడ్ స్టైలింగ్, టెక్నాలజీ, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ ఈ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1.56 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రస్తుతం HMSI రెడ్ వింగ్, బింగ్‌బింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ మార్కెట్లో యమహా MT 15 V2 తో పోటీపడుతుంది. హోండా హార్నెట్ 2.0 vs యమహా MT 15 V2 మధ్య ఏ బైక్ తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తుందో.. ఏది మంచి మైలేజీని ఇస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

హోండా హార్నెట్ 2.0 లో అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మోటార్ సైకిల్‌లో భారీగా కొత్త గ్రాఫిక్స్ ఉపయోగించారు. దీనితో పాటు అధునాతన TFT డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు. దీనితో పాటు ఇది బాడీ ప్యానెల్స్‌పై అద్భుతమైన కొత్త గ్రాఫిక్స్‌ను కూడా కలిగి ఉంది. ఈ బైక్ కు పూర్తిగా కొత్త LED లైటింగ్ సెటప్ కూడా ఉంది. ఇది నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, SMS నోటిఫికేషన్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. యమహా MT 15 V2 లోని ఫీచర్లతో సింగిల్ పాడ్ LED హెడ్‌ల్యాంప్, LED DRL, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

Read Also:Rashmika Mandanna: హీరోలకు లక్కీ గాళ్ రష్మిక మందన్న!!

హోండా హార్నెట్ 2.0 vs యమహా MT 15 V2 కలర్ ఆప్షన్లు
హోండా హార్నెట్ 2.0 4 న్యూ కలర్ ఆఫ్షన్లలో ప్రవేశపెట్టింది. ఇందులో ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఉన్నాయి. కాగా, MT 15 V2 రంగులు సియాన్ బ్లూ, రేసింగ్ బ్లూ. ఈ బైక్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లపై బూడిద రంగు డెకాల్స్‌తో బ్లాక్ బాడీ ప్యానెల్‌లతో మెటాలిక్ బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.

హోండా హార్నెట్ 2.0 vs యమహా MT 15 V2 ఇంజిన్
ఈ బైక్ OBD2B-కంప్లైంట్. ఇందులో 184.40 సిసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 12.50 kW పవర్ ను, 15.7 Nm మాగ్జిమన్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. MT 15 V2 బైక్ 155cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ ఇంజన్ 10,000rpm వద్ద గరిష్టంగా 18.4bhp పవర్, 7,500rpm వద్ద 14.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also:Masthan Sai: ఆట్ కమల్ హాసన్.. యువతులతో మస్తాన్ సాయి ఎమోషనల్ డ్రామా!

హోండా హార్నెట్ 2.0 vs యమహా MT 15 V2 ధర
హోండా హార్నెట్ 2.0 ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.56 లక్షలు. ఈ బైక్‌ను ఒకే వేరియంట్‌లో ప్రవేశపెట్టారు కానీ 4 కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ అన్ని హోండా రెడ్ వింగ్, బింగ్‌బింగ్‌లలో లభిస్తుంది. ధర పరంగా యమహా MT 15 V2 బైక్ మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్ ధర రూ. 1,70,086.