NTV Telugu Site icon

Barbie Telugu OTT : ఓటీటీలోకి ఆస్కార్ కొట్టిన హాలివుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Brbiee

Brbiee

ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హాలివుడ్ మూవీ తెలుగులో రాబోతుంది..హాలీవుడ్ మూవీ బార్బీ ఆస్కార్స్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొని చరిత్రను సృష్టించింది. గత ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకొని సరికొత్త రికార్డ్ ను అందుకుంది.. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో రాబోతుంది..

తెలుగు వెర్షన్ శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది.. ఇక ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ లో విడుదలైంది.. అక్కడ మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. జియో సినిమా ప్రీమియర్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఈ మూవీని చూడొచ్చు..

ఇక ఈ మూవీ 128 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన బార్బీ మూవీ ఏకంగా 1.44 బిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ ను అందుకోని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది… ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని గౌరవాన్ని కూడా అందుకుంది…ఇండియాలో బార్బీ మూవీకి దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ మూవీగా చోటు సంపాదించింది.. ఇక ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను అందుకుంది.. ఈ కథ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాకు ఇప్పటికి డిమాండ్ తగ్గలేదు.. ఈరోజు నుంచి తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.. చూసి ఎంజాయ్ చెయ్యండి..