Site icon NTV Telugu

NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..

Ntr

Ntr

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ లెవెల్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా, ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని, భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ ఇద్దరికి ఇద్దరు తమ అద్భుతమైన నటనతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నారు.

దీంతో ఇద్దరి హీరోల తదుపరి చిత్రలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే అయిందని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వినపడినప్పటికి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడన్న టాక్ గట్టిగా వినపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా హాలీవుడ్ ‘సూపర్‌మ్యాన్’, ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ’, ‘సూసైడ్ స్క్వాడ్’ వంటి సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ దీనిపై హింట్‌ ఇచ్చారు.

Alsi Read:Pisasu 2: న్యూడ్‌గా నటించేందుకు ఒప్పుకున్న స్టార్ హీరోయిన్..

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ‘ ‘RRR’ సినిమాలో పులితో ఎన్టీఆర్ సీన్స్ అదుర్స్ అనిపించాయి, ఆయనతో పని చేయాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. తనకు నేను ఫిదా అయిపోయాను. భవిష్యత్తులో అతనితో పని చేసే అవకాశం వస్తే ఆనందంగా ఉంటుంది. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న’ అని తన మనసులో మాట బయట పెట్టాడు. ప్రస్తుతం జేమ్స్ గన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version