NTR : ఎన్టీఆర్‌తో వర్క్ చేయాలని ఉందంటున్న హాలీవుడ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ వరల్డ్ హీరో. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ భారీగా విస్తరించింది. ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచ ఆడియెన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also: Vikram : కమల్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్.. ఎందుకంటే ?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన జేమ్స్ కామెరూన్, స్టీవెల్ స్పీల్ బర్గ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను పొగిడారు. అలాగే ‘గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ 3’ డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా గతంలో ‘ఆర్ఆర్ఆర్’ నటులను ప్రశంసించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ను గుర్తు చేశారు. గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ ప్రమోషన్స్ లలో భాగంగా ప్రముఖ ఛానెల్ కు జేమ్స్ గన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఆయన ప్రస్తావించారు. ‘గార్డియన్ ఆఫ్ ది గాలక్సీ సిరీస్ లలో ఇండియన్ యాక్టర్ పరిచయం చేయాలంటే ఎవరినీ ఎంచుకుంటారు?’.. అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జేమ్స్ గన్ ఎన్టీఆర్ అని బదులివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Read Also:Shahrukh Khan : షారూఖ్‌కు షాక్.. కోర్టు ఏమన్నదంటే
జేమ్స్ గన్ మాట్లాడుతూ… గతేడాది బిగ్ సినిమాగా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ నటుడు.. బోనులోంచి పులులతో బయటికి వచ్చే వ్యక్తితో వర్క్ చేయాలని ఉంది. ఏదో ఒకరోజు తప్పకుండా వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. అమేజింగ్, కూల్’ అంటూ కామెంట్ చేశారు. అతని కోసం ప్రత్యేకమైన పాత్ర ఉందా? అని అడగగా, ఉందని చెప్పారు. ‘ఇప్పుడే తెలిదు. దానికి కొంచెం సమయం పడుతుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే తారక్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ స్సై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2లో నటించబోతున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!