John Amos : హాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూశారు. ఆయన వయసు 84సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చారు. ఆయన ఆగష్టు 21న చనిపోయారు. జాన్ అమోస్ ఫ్యామిలీ ఈ విషయాన్ని అక్టోబర్ 1న అఫిషియల్ గా ప్రకటించి షాక్ ఇచ్చింది. ఆయన చనిపోయిన సుమారు 50 రోజుల తర్వాత బయటి ప్రపంచానికి తెలిపారు. ఆయనకు రెండు సార్లు పెళ్లి కాగా ఇద్దరితోనూ డైవర్స్ అయ్యాయి. మొదటి భార్యతో ఇద్దరు సంతానం కలిగింది. టెలివిజన్ సిరీస్ ‘గుడ్ టైమ్స్’లో తన నటనకు ప్రసిద్ధి చెందిన జాన్ అమోస్ కన్నుమూశారన్న విషయాన్ని అతని కొడుకు మంగళవారం ప్రకటించారు. జాన్ కుమారుడు కెల్లీ క్రిస్టోఫర్ అమోస్ తన తండ్రి ఆగస్టు 21న మరణించినట్లు ధృవీకరించారు. అమోస్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు. అలాగే 50ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగారు.
Read Also:IND vs BAN: రేసులో రోహిత్, సిరాజ్, జైస్వాల్.. ఇద్దరిని వరించిన అవార్డు!
1939 డిసెంబర్27న జన్మించిన అమోస్ 1971లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023వరకు వివిధ సినిమాలు, టీవీ సిరీస్‌లలో గ్యాప్ ఇవ్వకుండా నటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా 1977లో వచ్చిన రూట్స్, గుడ్ టైమ్స్ అనే సిరీస్‌లతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పటివరకు సుమారు 50కి పైగా సినిమాల్లో నటించిన అమోస్ 100కు పైగా సీరియల్స్, సిరీస్‌లలో నటించాడు. చివరగా 2023లో వచ్చిన హాలీవుడ్ సినిమా ది లాస్ట్ పైఫిల్ మ్యాన్ సినిమాలో నటించిన అమోస్ 2022లో ది రైటోస్ జెమ్ స్టోన్స్ అనే సిరీస్‌లో నటించాడు. ఆయన ఎక్కువగా తండ్రి పాత్రలకు పాపులర్ కావడంతో అభిమానులు జాన్ ను ‘టీవి డాడ్’ అని పిలుచుకునేవారు. జాన్ అమోస్ మినీ సిరీస్ ‘రూట్స్’లో కింటే పాత్రను పోషించారు. ఈ సిరీస్ లో అద్బుతమైన నటనను కనబరిచినందుకు జాన్ ఎమ్మీ అవార్డుకు ఎంపికయ్యాడు.
Read Also:Pandu Ranga Temple: ఆ గుడికి వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతారు.. ఎందుకో తెలుసా?
అయితే జాన్ సినిమాల్లోకి అడుగు పెట్టడానికంటే ముందే ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ఆటగాడిగా మారాలని అనుకున్నారట. అనుకోవడమే కాదు కొలరాడో స్టేట్ యూనివర్శిటీకి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఆడారు కూడా. కానీ కొంతకాలం తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో తనకు ఇష్టమైన ఫుట్ బాల్ గేమ్ ను పక్కన పెట్టేసి, సినిమాలపై దృష్టి పెట్టారు. మరోవైపు జాన్ సైట్‌లో పలు వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. అతను ‘గుడ్ టైమ్స్’ సిరీస్ రచయితలతో ఆఫ్రికన్ అమెరికన్లును చిత్రీకరించే విధానంపై ఓపెన్ గానే విబేధించేవారని సమాచారం. అందుకే మూడు సీజన్ల తర్వాత జాన్ ను ‘గుడ్ టైమ్స్’ సిరీస్ నుండి తీసేశారు. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో జాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఇప్పుడు జాన్ కన్ను మూశారు అన్న విషయం తెలిసిన ఆయన అభిమానులు, హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.