Site icon NTV Telugu

Mamata Banerjee: రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిచారు.. నేతాజీ జయంతికి ఎందుకు సెలవు ఇవ్వలేదు..?

Mamatha

Mamatha

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సెలవు ప్రకటించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. “రాజకీయ ప్రచారం” కోసం సెలవులు మంజూరు చేశారని విమర్శించారు.

Read Also: Ayodhya Ram Mandir: బాలరాముడి పేరు మార్పు.. ‘బాలక్ రామ్ గా’ దర్శనం

రాజకీయ కార్యక్రమాలకు సెలవులు ఇచ్చినందుకు తాను సిగ్గుపడుతున్నాను, కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులకు ఏమీ చేయడం లేదని మమతా తెలిపారు. నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించేలా 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని.. కానీ నన్ను క్షమించండి, నేను విఫలమయ్యాను అని ఆమె అన్నారు.

Read Also: Madhya Pradesh: తన కారును ఓవర్‌టేక్ చేశారని ఇద్దరిని చితకబాదిన ఓ అధికారి..

ఇదిలా ఉంటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమై ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ, ఆయన ఏమయ్యారు.. ఆయన చనిపోయిన తేదీ ఇప్పటివరకు దేశ ప్రజలకు తెలియకపోవడం అవమానకరమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వం.. ఇంతవరకు ఏమీ చేయలేకపోయిందని తెలిపారు.

Exit mobile version