NTV Telugu Site icon

School Holiday Today: ఏపీలో భారీ వర్షాలు.. ఆ రెండు జిల్లాల్లో నేడు స్కూల్స్‌, కాలేజీలు బంద్‌

School Holidays

School Holidays

School Holiday Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి‌‌‌‌.. వాగులు వంకలు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.. భారీ వర్షాలకు కాళంగి రిజర్వాయర్, అరణియార్ ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేశారు అధికారులు.. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టుల్లోనూ.. డ్యామ్‌లలోనూ పూర్తిస్థాయిలో నీటి నిలువ చేరుకున్నాయి. అయితే, భారీ వర్షాలు.. వాగులు వంకల పొంగిపొర్లుతోన్న నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.. ఈ జిల్లాల పరిధిలోని స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ సెంటర్లు మూతపడ్డాయి.. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జి కలేక్టర్ భన్సల్.. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు..

Read Also: Vijayawada: నేడు స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల.. బెజవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు