Site icon NTV Telugu

Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలులో హోలీ సంబరాలు.. వీడియో వైరల్

Delhi Metro

Delhi Metro

ఢిల్లీ మెట్రో రైలులో ఇప్పటి వరకు ఎన్నో రకాల వీడియోలు తీసి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. వైరల్ వీడియోల్లో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు నిత్యం కనపడుతూనే ఉంటాయి. అందులో డ్యాన్స్ చేసేవి, కొట్టుకునేవి, పాటలు పాడేవి ఇలాంటి ఎన్నో రకాలైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెట్రో రైలులో ఇద్దరు అమ్మాయిలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అసహనం వ్యక్తం చేసింది.

Read Also: Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ యువతి మృతి

వైరల్‌ మారిన వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మెట్రో కోచ్‌లో కూర్చొని, ఒకరి చెంపలపై మరొకరు రంగులను రాసుకుంటున్నారు. అంతేకాకుండా.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ హిందీ పాట కూడా వస్తుంది. మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో ఇలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అంతేకాక ఈ వీడియోను రూపొందించడానికి డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాన్నీ డీఎంఆర్‌సీ వ్యక్తం చేసింది. మరోవైపు.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఇలాంటి రీల్స్ చేయద్దని ఎన్నోసార్లు సూచించినట్లు డీఎంఆర్సీ తెలిపింది. అయినప్పటికీ కొందరు యువత పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ విధంగా వీడియోలు చేస్తున్న వారిని చూసిన వెంటనే తమకు తెలియజేయాలని డీఎంఆర్సీ సూచించింది.

Read Also: Teppa Samudram: ఏం రాశావయ్యా పెంచల్ దాస్.. గుండెలను మెలిపెట్టేశావ్

Exit mobile version