BBL 2025: బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్‌లో హోబర్ట్ హరికేన్స్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం (జనవరి 21) రాత్రి జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ జరిగిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో మిచెల్ ఓవెన్ 3 ఫోర్లు, 3 సిక్సర్ల వేగవంతమైన ఇన్నింగ్స్‌లో భాగంగా 15 బంతుల్లో 36 పరుగులు చేయగా.. మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 10 బంతుల్లో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మిడిల్ ఆర్డర్లో కాలెబ్ జువెల్ 41 బంతుల్లో 40 పరుగులు, బెన్ మెక్‌డెర్మాట్ 31 బంతుల్లో 42 పరుగులతో రాణించారు. సిక్సర్స్ బౌలర్లలో జాఫర్ చోహాన్, బెన్ డ్వార్షుయిస్ చెరో రెండు వికెట్లు తీసి రాణించగా.. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ పెర్రీ చెరో వికెట్ తీశారు.
Also Read: Ration Cards: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి
ఇక 174 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ మొదట్లోనే తడబాటు పడింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో పడింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కర్టిస్ ప్యాటర్సన్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 33 బంతుల్లో 48 పరుగులు, జోర్డన్ సిల్క్ 44 బంతుల్లో 57 పరుగులు, లాచ్లన్ షా 25 బంతుల్లో 33 నాటౌట్ గా రాణించిన.. చివరకు హరికేన్స్ బౌలర్ల ముందు చివరికి విజయం సాధించలేకపోయారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కెమరూన్ గానన్ 3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కెప్టెన్ నాథన్ ఇల్లిస్ కూడా ఒక వికెట్ తీసి సిడ్నీ సిక్సర్స్ ను కేవలం 161 పరుగులకే పరిమితం చేసారు. దానితో హోబర్ట్ హరికేన్స్ 12 పరుగులతో విజయం సాధించింది.
Also Read: IND vs ENG: నేడే భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20
ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సిక్సర్స్‌కు ఇంకా మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్ మ్యాచ్‌లో నాకౌట్ విజేతతో తలపడుతుంది. ఈరోజు (జనవరి 22) జరుగనున్న నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక బిగ్‌బాష్ లీగ్ 2025 మెగా ఫైనల్ జనవరి 27న జరగనుంది. ఛాలెంజర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో హోబర్ట్ హరికేన్స్ ఫైనల్లో తలపడుతుంది.