Site icon NTV Telugu

Mokila Lands Auction: మోకిల ప్లాట్లకు మస్తు డిమాండ్

Mokila

Mokila

హైదరాబాద్ నగర శివారులోని శంకర్ పల్లి మండలం మోకిల గ్రామంలో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మోకిల లేఅవుట్ ప్లాట్లకు మస్తు డిమాండ్ నెలకొంది. దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: Ashwini Vaishnav: సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌.. టార్గెట్ అదే..!

అయితే, మోకిల ప్లాట్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో హెచ్ఎండీఏ రెండో దశలో 300 ప్లాట్లను ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నది. అయితే, దీనికి సంబంధించి నేడు (గురువారం) మోకిల లేఅవుట్ ప్రాంతంలో హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి అనూహ్యమైనరీతిలో స్పందన వచ్చింది. ప్రీబిడ్ సమావేశంలో ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే పద్ధతులను వివరించారు. హెచ్ఎండీఎస్ సెక్రెటరీ చంద్రయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ ప్రాముఖ్యతను వివరించారు. ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

Read Also: New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఇక కార్యక్రమంలో హెచ్ఎండీఏ సెక్రెటరీ పి.చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రీబిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐఓ) ఎస్.కె.మీరా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ) రవీందర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) సాయిరాం, శంకర్ పల్లి మండలం తహశీల్దార్ సురేంద్రలతో పాటు హెచ్ఎండీఏ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Exit mobile version