HIT2 Song Promo: హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన అడవి శేష్

Urike Urike

Urike Urike

HIT2 Song Promo: అడివి శేష్, మీనాక్షి చౌదరీ హీరోహీరోయిన్లుగా సైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా హిట్ 2. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఉరికే ఉరికే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సిద్ శ్రీరామ్ పాడితే చాలు ఆ సాంగ్ సూపర్ హిట్టయిపోతుంది. రొమాంటిక్ మెలోడీ సాంగ్స్‌ అన్నీ సిద్ శ్రీరామ్‌ను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయనకే మరో అద్భుత సాంగ్ దొరికింది. ఆ పాట వింటుంటేనే మంచి మెలోడీ ఫీల్ కలిగించింది.

Read Also: Danger with Non Stick Pans : ఆ పాత్రలు వాడితే ఆస్పత్రి పాలు కావాల్సిందే

×
×
Ad

హీరో, హీరోయిన్లుగా నటించిన అడివి శేష్, మీనాక్షి చౌదరీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ప్రోమోనే ఇలా ఉంటే.. కచ్చితంగా ఫుల్ సాంగ్ వేరే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సిద్ శ్రీరామ్‌తో పాటు రమ్యా బెహ్రా పాడారు. ఈ పాటకు ఎంఎం శ్రీ లేఖ సంగీతాన్ని అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ పాట ఫుల్ సాంగ్ ఈ నెల 10న అంటే గురువారం విడుదల కాబోతుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ కేడీ అనే పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

Vivek Ranjan Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలనం

https://www.youtube.com/watch?v=CoVo0ypWbi4&t=28s&ab_channel=SaregamaTelugu