NTV Telugu Site icon

Bandh Continue In Medak: నేడు మెదక్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు..

Medak

Medak

Bandh Continue In Medak: మెదక్ జిల్లాలో ఇవాళ (సోమవారం) బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ నేడు జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం తెలిపాయి. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించాలని సందర్భంగా వారు కోరాయి.

Read Also: Uttam Kumar Reddy : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలి

కాగా, శనివారం రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ, పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం సైతం మెదక్ పట్టణంలో బంద్ కు పిలుపనివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ ​బంక్​లు, హోటళ్లు, దుకాణాలు స్వచ్చందంగా క్లోజ్ చేశారు. బస్టాండ్​లు, చౌరస్తాల దగ్గర పోలీసులు​ పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించారు.. దీంతో ఆర్టీసీ బస్సులు నడిచాయి. ఇక, ఈ ఘటనపై రంగంలోకి దిగిన మల్టీజోన్ ​ఐజీ రంగనాథ్​ మెదక్ పట్టణానికి వచ్చి ఎస్పీ బాలస్వామితో కలిసి పరిస్థితి గురించి సమీక్ష నిర్వహించారు.

Read Also: youtube: యూట్యూబ్ యూజర్స్ ఎక్కువగా వేటి కోసం సర్చ్ చేస్తున్నారో తెలుసా..?

అలాగే, శనివారం జరిగిన గొడవలు, దాడులకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన 45 మందిని గుర్తించామని ​ఐజీ రంగనాథ్ చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసి ఓ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్ట్​ చేశామన్నారు. మరో వర్గానికి చెందిన వారిని సైతం అరెస్ట్​ చేస్తామని పేర్కొన్నారు. ఈ ఇష్యూపై ఎంపీ రఘునందన్ రావుతో ఐజీ ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుంటున్నామని ఎంపీకి ఆయన హామీనిచ్చారు. ఐజీ హామీతో మెదక్ కు రాకుండా మధ్యలోనే ఎంపీ రఘునందన్ రావు ఆగిపోయారు.