Site icon NTV Telugu

Bhagavanth Kesari : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ‘భగవంత్ కేసరి’హిందీ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Bhagavanth Kesari

Bhagavanth Kesari

Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలయ్య నటించిన “భగవంత్ కేసరి”మూవీ గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది.స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు.ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో నిర్మించగా..ఈ మూవీ 70 కోట్లకు పైగా షేర్ ని అలాగే 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

Read Also :Tyson Naidu : రాజస్థాన్ లో ‘టైసన్ నాయుడు’ భారీ యాక్షన్ షెడ్యూల్..

ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.అయితే ఈ సినిమా ఓటిటి లో కూడా అదరగొట్టింది.తాజాగా ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ రైట్స్ ను జియో సినిమా సొంతం చేసుకుంది.జియో సినిమాలో ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రస్తుతం స్ట్రీమింగ్  అవుతుంది.

Exit mobile version