NTV Telugu Site icon

Himanshu : గొప్ప మనసు చాటుకున్న కేసీఆర్‌ మనవడు.. రూ. కోటితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసిన హిమన్షు

Himanshu

Himanshu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు. దాదాపు కోటి రూపాయలు వెచ్చించి రీ డెవలప్ చేశాడు. దీంతో గచ్చిబౌలి కేశవనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు కార్పొరేట్‌ పాఠశాలగా మారిపోయింది. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. హిమాన్షు తన ట్విటర్‌లో ఫోటోలను పోస్ట్ చేసి ‘ గతంలో పాఠశాల పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు అది ఎలా మారిపోయింది.’ అంటూ పోస్ట్ చేశారు.

Also Read : Minister Vidadala Rajini: మంత్రి విడదల రజనీకి అస్వస్థత.. వెంటనే బెజవాడకు..

దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు హిమాన్షుపై, ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఖాజాగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హిమాన్షు క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సీఏఎస్ తరపున తమ పాఠశాలకు సమీపంలోనే ఉన్న కేశవనగర్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు. తన పాఠశాలలో నిధులు సేకరించి ఈ పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేశారు. సీఏఎస్ నిధులతో బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, లంచ్ రూమ్, ప్లేగ్రౌండ్ తదితర సౌకర్యాలు కల్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాములు యాదవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Also Read : Nani : కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాని..?

Show comments