NTV Telugu Site icon

Cloudburst: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన వాహనాలు

Cloudburst

Cloudburst

Cloudburst: భారీ వర్షాలు,కొండచరియలు విరిగిపడడంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులతో పోరాడుతోంది. కిన్నౌర్‌లో మేఘాల విస్ఫోటనం(క్లౌడ్ బరస్ట్) కారణంగా నీటి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. బలమైన ప్రవాహానికి డజన్ల కొద్దీ వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ రాష్ట్రంలో చాలా ఆస్తి నష్టం సంభవించింది. కిన్నౌర్‌లోని సాంగ్లా వ్యాలీలో డజన్ల కొద్దీ వాహనాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.

Read Also:Supreme Court: మణిపూర్ ఘటన.. కేంద్ర ప్రభుత్వం పై సుప్రీం సీరియస్

గురువారం ఉదయం 6.30 గంటలకు సాంగ్లాలోని కమ్రు గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద వచ్చింది. వర్షం నీరు, శిధిలాలు పర్వతం నుండి వేగంగా ప్రవహించాయి. దాంతో ఆ మార్గంలో ప్రయాణించే చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ శిథిలాల కారణంగా యాపిల్ సహా అనేక ఇతర పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఏమవుతుందోనన్న భయంతో ప్రజలు బతుకుతున్నారు. వరదల అనంతరం రెవెన్యూ శాఖ బృందం నష్టాన్ని అంచనా వేస్తోంది. దాదాపు 20 నుంచి 25 వాహనాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. మరోవైపు, సిమ్లా సమీపంలోని ఓ గ్రామంలో వేగంగా కదులుతున్న శిథిలాల కింద ఓ మహిళ సమాధి అయింది. చంబాలోని సలోనిలో కూడా భారీ వర్షాల కారణంగా బుధవారం చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. కులులో కూడా వరదలకు ఒకరు మరణించారు.

Read Also:Godavari River : అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

జూలై 8 – 11 మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసినప్పటి నుండి, రాష్ట్రం ఇంకా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పటికీ అనేక జిల్లాల్లో ప్రజలు నిర్వాసితులై భయంతో జీవిస్తున్నారు. జులై 20 నుంచి 25 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.