Hilary Swank: ‘మిలియన్ డాలర్ బేబీ’కి దేవుడిచ్చిన కానుక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hilary Swank: దాదాపు 19 ఏళ్ళ క్రితం ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుండ్ డైరెక్షన్ లో రూపొందిన ‘మిలియన్ డాలర్ బేబీ’ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇందులో బాక్సర్ గా నటించిన హీరోయిన్ హిలరీ శ్వాంక్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డునూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిలరీ శ్యాంక్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప, ఒకరు బాబు. దీనికంటే విశేషమేమంటే ప్రస్తుతం హిలరీ వయసు 48 సంవత్సరాలు. ఈ వయసులో అదీ కవలలకు జన్మనివ్వడం శ్వాంక్ తో పాటు ఆమె అభిమానులకూ ఆనందం కలిగిస్తోంది.
హిలరీ శ్వాంక్ 1997లో ఛార్లెస్ డేవిస్ లోవ్ అనే యాక్టర్ ను పెళ్ళాడింది. పదేళ్ళ కాపురం తరువాత ఇద్దరూ విడిపోయారు. 2018 దాకా ఒంటరిగానే జీవనం సాగించిన శ్యాంక్ జీవితంలోకి భాగస్వామిగా వ్యాపారవేత్త ఫిలిప్ స్నెయిడర్ అడుగుపెట్టాడు. దాదాపు ఐదేళ్ళకు ఈ దంపతులకు పిల్లలు జన్మించడం వారికి మహదానందం కలిగిస్తోంది. దాంతో తమ కవలలను సోషల్ మీడియా ద్వారా లోకానికి పరిచయం చేశారు శ్యాంక్ దంపతులు. కవలలను దేవుడు తనకు ‘ఈస్టర్’ పర్వదినాన ఇచ్చిన కానుకగా భావిస్తున్నానని శ్వాంక్ అంటోంది.
Also Read
తాజావార్తలు
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!