వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై హిజ్రాలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమీర్‌పేట మైత్రివనం సిగ్నల్ వద్ద హిజ్రాల ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అయితే.. వైఎస్ షర్మిల బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ భారీగా హిజ్రాలు నిరసన తెలిపారు. అయితే..ఇటీవల వైఎస్ షర్మిల బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ ప్రస్తావన తెచ్చినందు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా అమీర్‌పేటలో హిజ్రాలు చేసిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తమకు షర్మిల తక్షణం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు హిజ్రాలు.
Also Read : Vladimir Putin: వారి వల్లే యుద్ధం.. మేం చర్చలకి సిద్ధం.. పుతిన్ షాకింగ్ స్టేట్‌మెంట్
అయితే.. ఇటీవల షర్మిల మహూబుబాబాద్ లో మాట్లాడుతూ.. ‘శంకర్ నాయక్ తనను శిఖండి అని కొజ్జా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడిన షర్మిల ఎవడ్రా కొజ్జా.. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చెయ్యని మిమ్మల్ని కొజ్జాలు కాకుంటే మరేమంటారు అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారు అంటూ’ అంటూ తీవ్ర స్థాయిల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా హిజ్రాలు ధర్నాకు దిగారు. అమీర్‌పేటలోనే కాకుండా.. వరంగల్‌లోనూ హిజ్రాలు ధర్నాకు దిగారు. షర్మిల ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి దగ్దం చేశారు.
Also Read : Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. 35 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే