NTV Telugu Site icon

Students Missing: ఇద్దరు విద్యార్ధుల మిస్సింగ్.. పోలీసుల ఎంక్వైరీ

Missing

Missing

ఈమధ్య కాలంలో పిల్లలు తప్పిపోవడం కామన్ అయిపోయింది. స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్లే పిల్లలు వివిధ కారణాల వల్ల మిస్ అవుతున్నారు. ఏలూరు జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు స్కూల్ విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠాశాలలో ఎనిమిదో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also:Father Cruelty: తండ్రి కాదు రాక్షసుడు.. ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని వార్నింగ్

8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గుర్రం మహేష్,అబ్బదాసరి అఖిల్ కనిపించకుండా పోయారు. గుర్రం మహేష్ ది టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడెం, అఖిల్ ది లింగపాలెం మండలం గోకవరం. వీరిద్దరు ఎర్రగుంటపల్లి వెనకబడిన తరగతుల హాస్టల్ లో వుండి హైస్కూల్ లో చదువుకుంటున్నారు. అయితే మంగళవారం సాయంత్రం అఖిల్ ని తన తల్లిదండ్రులు యర్రగుంట పల్లి హాస్టల్ లొ జాయిన్ చేసి వెళ్ళిపోయారు. మర్నాడు బుధవారం స్కూల్ కి వెళ్ళిన అఖిల్ కనిపించకుండా పోయాడు.

ఇక గుర్రం మహేష్ బుధవారం ఉదయం హాస్టల్ కి వచ్చిన తరువాత స్కూల్ కి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఈ ఘటనతొ ఖంగుతిన్న వార్డెన్ సాధన పిల్లల తల్లిదండ్రులకు,స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించి చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: Project K: బస్సు దిగిన ప్రతోడు ఆ పనే చేయడు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్