NTV Telugu Site icon

TG CETs: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్‌ల నియామకం

Tg Cets

Tg Cets

TG CETs: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్‌లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఏడు సెట్‌లకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీ ఏ పరీక్షను నిర్వహిస్తుందో కూడా ప్రకటించింది. ఈ ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలో విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది.

Read Also: President Droupadi Murmu: శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కన్వీనర్లు వీరే..
1.టీజీ ఎప్‌సెట్(TG EAPCET) – ప్రొఫెసర్‌ బి.డీన్‌ కుమార్ (జేఎన్‌టీయూ హెచ్‌)
2. టీజీ పీజీఈసెట్(TG PGECET) -ప్రొఫెసర్‌ ఎ.అరుణ కుమారి(జేఎన్‌టీయూ హెచ్‌)
3. టీజీ ఐసెట్(TG ICET)- ప్రొఫెసర్ అలువాల రవి(మహాత్మ గాంధీ యూనివర్సిటీ)
4. టీజీ ఈసెట్(TG ECET) – ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్‌ (ఉస్మానియా యూనివర్సిటీ)
5. టీజీ లా సెట్ &టీజీ పీజీఎల్‌సెట్ (TG Law CET &TG PGLCET) – ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి(ఉస్మానియా యూనివర్సిటీ)
6. టీజీ ఎడ్‌సెట్(TG EDCET) – ప్రొఫెసర్ బి.వెంకట్రామ్‌ రెడ్డి(కాకతీయ యూనివర్సిటీ)
7.టీజీ పీఈ సెట్(TG PECET) – ప్రొఫెసర్ ఎన్‌.ఎస్. దిలీప్(పాలమూరు యూనివర్సిటీ)