Site icon NTV Telugu

High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో హై టెన్షన్‌..

High Tension In Vijayawada

High Tension In Vijayawada

High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు బాధితులు.. వారిని స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు.. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు.. అయితే, పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు. మరోవైపు.. భవానీపురంలో భవనాలు కూల్చివేసిన తర్వాత.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

కాగా, భవానీపురంలో రెండు ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీ రామ కో ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ గెలిచింది. దీంతో.. ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. అయితే.. 25 ఏళ్లుగా ఉంటున్న తమని.. కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని.. తమ ఇళ్లను కూడా వేస్తున్నారని ఫ్లాట్స్‌ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం.. ఈ గొడవ జరుగుతోంది. ఇళ్లను చాలా వరకు కూల్చేశారు అధికారులు. ఇప్పుడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. అయితే, ఉదయం 10.45 గంటలకు స్టే వచ్చిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని బాధితులు మండిపడుతున్నారు.. సుప్రీంకోర్టు ఆర్డర్‌కు సంబంధించిన వీడియో చూపించినా.. కూల్చివేతలు ఆపలేదని ఫైర్‌ అవుతున్నారు..

Exit mobile version