Site icon NTV Telugu

TDP vs YCP: నల్లజర్లలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

Nallajarla

Nallajarla

TDP vs YCP: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది. మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది. నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్‌ సైలెన్సర్లతో హంగామా సృష్టించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తానేటి వనిత ఉన్న ప్రాంగణంలో కుర్చీలను టీడీపీ శ్రేణులు బద్దలు కొట్టగా.. దీంతో నల్లజర్ల ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీజే వ్యాన్‌లతో పాటు కారు అద్దాలను కూడా టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ, పోలీసు బలగాలు అక్కడి వారిని చెదరగొట్టారు. గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు.

 

Exit mobile version