NTV Telugu Site icon

Huzurabad: హుజూరాబాద్ లో హైటెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లు

New Project (3)

New Project (3)

హుజూరాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. గతం లో ఫ్లైయాష్ విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ప్రణవ్ ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు, రైస్ మిల్లర్లు, ఇసుక మాఫియా వద్ద డబ్బులు వసూలు చేశాడని, పూర్తి ఆధారాలతో చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తున్నానని, నీకు ధైర్యం ఉంటే నీవు కూడా వచ్చి డబ్బులు తీసుకోలేదని ఆంజనేయుని పై ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు విసిరిన సవాల్ ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి.. ఇవాళ చేల్పూర్ హనుమాన్ దేవాలయానికి రానున్నారు.

READ MORE: Credit Card : ఉద్యోగం, ఇన్ కం ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందవచ్చా ?

ఈ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి బిఅర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటి నుంచి హుజురాబాద్‌లో ప్రణవ్, కౌశిక్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పుడు ప్రణవ్‌కు మంత్రి పొన్నం అండ పుష్కలంగా ఉంది. కౌశిక్‌కు కెప్టెన్ వర్గం అండ దండలు ఉన్నాయి. దీంతో వీరి మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటం నడుస్తుంది. తాజాగా పొన్నంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటుగా ప్రణవ్ బాబు కౌంటర్ ఛాలెంజ్ చేయడం, ఇద్దరు చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేదిక చేసుకోవడంతో ఈ రోజు 11 గంటలకు అక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. పోలీసులు ముందుగానే చెల్పూర్‌కు వెళ్లి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.