Site icon NTV Telugu

High Tension: వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉద్రిక్తత

High Tension

High Tension

High Tension at Vallabhaneni Vamsi’s Residence: విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు కార్లలో వంశీ ఇంటి వద్దకు వచ్చిన యువకులు.. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో గేట్లు పగులగొట్టే ప్రయత్నం చేశారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగబోయారు. భారీగా యువకులు చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. వల్లభనేని వంశీ ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్‌తో పాటు ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినా కూడా వంశీ ఇంటి సెల్లార్‌లో ఉన్న కార్లను ధ్వంసం చేశారు ఆ యువకులు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ యువకుల నుంచి కర్రలు, రాడ్లను పోలీసులు లాక్కున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన డీసీపీలు అధిరాజ్‌ సింగ్ రాణా, చక్రవర్తిలు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Read Also: R Krishnaiah: ఏపీలో వైసీపీ ఓటమిపై రాజ్యసభ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

 

Exit mobile version