Site icon NTV Telugu

AP-Telangana Border: ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత!

Ap Telangana Border

Ap Telangana Border

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్‌లో ఏపీ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు గురువారం రాత్రి ఆపేశారు. దీంతో తంగెడ కృష్ణానది బ్రిడ్జిపై ధాన్యం లారీలు భారీగా నిలిచిపోయాయి. ధాన్యం లారీల నిలిపివేతతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. కృష్ణానది బ్రిడ్జిపై లారీలు అడ్డంపెట్టి డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలను వెంటనే పంపాలంటూ ఆందోళన చేపట్టారు.

Also Read: Shreyas Iyer-BCCI: చూసుకోవాలి కదా శ్రేయాస్ భయ్యా.. బీసీసీఐ అన్నీ గమనిస్తుంది!

తెలంగాణ నుంచి వస్తున్న లారీలను సైతం ఏపీ అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో 4 గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాడపల్లి బ్రిడ్జి వద్ద 5 లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్‌ చేయడం, కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నాయని చెప్పడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ సరిహద్దు ఉద్రిక్తతపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించాల్సి ఉంది.

Exit mobile version